మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కులవృత్తులను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని ధర్మాపూర్ చెరువులో మత్స్యశాఖ తరఫున ఉచిత చేప పిల్లల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని 1,086 చెరువుల్లో రూ.114.53 లక్షల వ్యయంతో 190.16 లక్షల చేపపిల్లలను వదులుతున్నామన్నారు.
దేశంలో ఎక్క డా లేని విధంగా ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకునేందుకు చెరువులు, కుంటలు, జలాశయాల్లో ఉచితంగా చేపపిల్లలను వదలడంతో మత్స్య సంపద రెట్టింపైందన్నారు. ఫలితంగా అనేక కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. చెరువులపై మత్స్యకారులకే పూర్తి ఆధిపత్యం ఉం టుందని, దళారులకు చెరువులు అప్పగించి మోసపోవద్దని సూచించారు.
చేపపిల్లల నాణ్యతలో రాజీ పడొద్దన్నారు. సబ్సిడీపై వలలు, వాహనాలు, ఇతర సామగ్రి అందించడంతో సొసైటీలు బ లోపేతమయ్యాయని వివరించారు. కా ర్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, పర్సన్ ఇన్చార్జి స త్యనారాయణ, మత్స్యశాఖ అధికారిణి రాధారోహిణి, జెడ్పీటీసీ వెంకటేశ్వర మ్మ, ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి, మత్స్యశా ఖ గ్రామ అధ్యక్షుడు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.