గండీడ్/మహ్మదాబాద్, సెప్టెంబర్ 5 : అర్హులైన ప్రతిఒక్కరికీ ఆసరా పింఛన్ మంజూరు చేస్తామని పరి గి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. గండీడ్ మండలంలోని పెద్దవార్వల్, చిన్నవార్వల్, సాలార్‌నగర్, వెన్నాచేడ్, జిన్నారం, రంగారెడ్డిపల్లి, మన్సూర్‌పల్లి, గండీడ్, రెడ్డిపల్లి, కొంరెడ్డిపల్లి, మహ్మదాబాద్ మండలంలోని జూలపల్లి, మొకర్లాబాద్, మంగంపేట, చౌదర్పల్లి, గాధిర్యాల్ గ్రామాల్లో సోమవారం ఆసరా పథకం లబ్ధిదారులకు పింఛన్‌కార్డులను పంపిణీ చేశా రు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతున్నదని తెలిపారు. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలతోపాటు వివిధ రంగాల కార్మికులకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 పింఛన్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతుబంధుతో రైతులకు ఎంతో మేలు చేకూరుతున్నదని తెలిపారు. నియోజకవర్గంలో 1500 రైతు కుటుంబాలకు రైతుబీమాను అందజేసినట్లు వివరించారు. అలాగే కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, నిరంతర విద్యుత్ సరఫరా, కేసీఆర్ కిట్ తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.
అలాగే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దవార్వల్ పాఠశాలలో ఉపాధ్యాయులతోపాటు విశ్రాంత ఉపాధ్యాయుడు నర్పప్పను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, పీఏసీసీఎస్ వైస్‌చైర్మన్ లక్ష్మీనారాయణ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఉప్పరి గోపాల్, సర్పంచులు అంజిలమ్మ, లలిత, పుల్లారెడ్డి, లక్ష్మీదేవి, లక్ష్మీబాయి, శ్రీనివాస్, చంద్రకళ, హన్మంతు, కిరణ్‌కుమార్‌రెడ్డి, రక్షిత, శ్రీనివాస్, వెంకటమ్మ, వెంకట్రాంరెడ్డి, ఎంపీటీసీలు శైలజ, బాలయ్య, బాలకిష్టయ్య, రేణుక, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, రాజ్‌కుమార్‌రెడ్డి, వెం కటయ్య, రాంరెడ్డి, రాంచంద్రారెడ్డి, రమేశ్‌రెడ్డి, నగేశ్, అశోక్‌గౌడ్, తిరుమల్, జోగు కృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెంట్యానాయక్, భిక్షపతి పాల్గొన్నారు.