పాలమూరు, సెప్టెంబర్ 5 : నవసమాజ నిర్మాణం ఉపాధ్యాయులతోనే సాధ్యమవుతుందని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెడ్పీ సమావేశ మందిరంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నతికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషి మరవలేదన్నారు.
మరింత అంకితభావంతో పనిచేసి విద్యార్థుల బం గారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఈవో రవీందర్, జెడ్పీ డిప్యూటీ సీఈవో మొగులప్ప, హన్వాడ ఎంపీపీ బాలరాజు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నా రు. అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీడీ బాలరాజుగౌడ్, అడిషనల్ పీడీ విష్ణువర్ధన్‌రెడ్డిని విద్యార్థులు సన్మానించారు.
అలాగే జేపీఎన్సీఈలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి కళాశాల చైర్మన్ రవికుమార్, ప్రిన్సిపాళ్లు పవన్‌కుమార్, చంద్రశేఖర్ పూలమాల వేసి నివాళులర్పించారు. న్యూరిషి పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు మల్లికార్జున్, చైర్మన్ చంద్రకళ, కరస్పాండెంట్ పూజితామోహన్రెడ్డి పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 5 : జిల్లా కేంద్రంలోని ఆల్‌మదీనా బీఈడీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్‌ఇసాక్ ముఖ్యఅతిథిగా హాజరై అధ్యాపకులను సన్మానించారు. కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్ అశోక్, మైనార్టీ సంక్షేమశాఖ జిల్లా అధికారి శంకరాచా రి, ఆర్ఎల్సీ జమీల్ అహ్మద్, సజ్జద్ పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ అర్బన్, సెప్టెంబర్ 5 : జిల్లా కేంద్రంలోని టీడీగుట్టకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు గంగయ్యను పూర్వవిద్యార్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యాదయ్య, సిద్ధిలింగయ్య, బాలకృష్ణయ్య, శివు డు, రామ్మూర్తి పాల్గొన్నారు.
కోయిలకొండ, సెప్టెంబర్ 5 : ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని ఎంపీపీ శశికళాభీంరెడ్డి అన్నారు. మండలకేంద్రంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, తాసిల్దార్ ప్రేంరాజ్, ఎంపీడీవో జయరాం, సర్పంచ్ కృష్ణయ్య, ఎంఈవో లక్ష్మణ్, ఎంపీవో శ్రీదేవి, హెచ్ఎం మదన్‌మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్, రాజవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 5 : సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని జడ్చర్లలో ఘనంగా నిర్వహించారు. బాదేపల్లి సరస్వతీ శిశుమందిరం పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. అలాగే అంజనాద్రినగర్‌లో ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలను జరుపుకొన్నారు. గంజ్‌లోని ఎస్బీఐలో బ్యాంకు చీఫ్ మేనేజర్ శేషపణి ఆధ్వర్యం లో విశ్రాంత ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించా రు. 19వ వార్డులో కౌన్సిలర్ సాజిదాఇఫ్తేకార్ ఆధ్వర్యంలో ప్రభు త్వ పాఠశాల ఉపాధ్యాయులను సత్కరించారు. కార్యక్రమం లో విశ్రాంత ఉపాధ్యాయులు వేణుగోపాల్, పాండురంగ య్య, బి.యాదగిరి, బాల్‌రెడ్డి, ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు బాలమణి, బృందం గోపాల్, శ్రీనివాస్‌గౌడ్, కేశవులు, అరుణ్‌కుమార్, పరంజ్యోతి, గోపాల్‌గౌడ్, హెచ్ఎంలు శోభారాణి, అతియాసుల్తానా పాల్గొన్నారు.
మిడ్జిల్, సెప్టెంబర్ 5 : మండలకేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, అధ్యాపకులను జనతాపరివార్ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమం లో తాసిల్దార్ శ్రీనివాసులు, ఎస్సై రాంలాల్‌నాయక్, ఎంపీటీసీ గౌస్, పీఏసీసీఎస్ వైస్‌చైర్మన్ అల్వాల్‌రెడ్డి, హెచ్ఎంలు రవికుమార్, భాగ్యలక్ష్మి, టీఆర్ఎస్ నాయకలు వెంకట్‌రెడ్డి, మల్లయ్య, జనతాపరివార్ సభ్యులు బాల్‌రెడ్డి, సంపత్‌కుమా ర్, రాజేశ్వర్, వెంకటేశ్, భాస్కర్, కృష్ణాగౌడ్, శంకర్, జహంగీర్, అశోక్, తిరుపతి, సయ్యద్, మహేశ్, శివ పాల్గొన్నారు.
రాజాపూర్, సెప్టెంబర్ 5 : మండలంలోని తిర్మలాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వవిద్యార్థులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగ్రహీత అజీజ్‌తోపాటు పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హెచ్ ఎం సంధ్యారాణి, రవికుమార్, రోజారాణి, శ్రీనివాస్‌రెడ్డి, హతీరాం, సురేందర్‌రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు.
మహ్మదాబాద్, సెప్టెంబర్ 5 : మండలంలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నా రు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ప్రజాప్రతినిధులు, విద్యార్థులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రక్షిత పాల్గొన్నారు.
మూసాపేట, సెప్టెంబర్ 5 : మండలంలోని నిజాలాపూర్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తె లుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగ్రహీతలు నందిపేట గోవర్ధన్, తుంకినీపూర్ హెచ్ఎం మావిళ్ల లక్ష్మణ్‌గౌడ్‌ను సన్మానించారు.
అడ్డాకుల ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి ఉపాధ్యాయులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంఈవో నాగయ్య, నోడల్ ఆఫీసర్ మాలిని, ఉమాపతిరెడ్డితోపాటు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శ్రీధర్‌గౌడ్, ఆంజనేయులు, సత్యం, బాలరాజు, తారాసింగ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
నవాబ్‌పేట, సెప్టెంబర్ 5 : మండలకేంద్రంతోపాటు ఇప్పటూర్, చాకలిపల్లి, మరికల్, కారుకొండ పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఇప్పటూర్‌లో ఎంపీటీసీ లక్ష్మీబాయి, యువనాయకుడు నవనీతరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను సన్మానించారు. నవాబ్‌పేటలో సీనియర్ సిటిజన్స్‌ఫోరం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను సన్మానించి వారి సేవలను కొనియాడారు. కార్యక్రమం లో సర్పంచులు గోపాల్‌గౌడ్, గౌసియాబేగం, రాములమ్మ, నాయకులు అబ్దుల్లా, నర్సింగరావు, సూర్యప్రకాశ్‌రావు, నాగభూషణం, రామకృష్ణాగౌడ్ పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 5 : మండలంలోని పేరూర్, కౌకుంట్ల, గోపన్‌పల్లి, డోకూర్, కోయిలసాగర్, లక్ష్మీపల్లి పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నా రు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహం, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం ఉత్త మ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు నాగేందర్, అబ్దుల్‌హక్, మాధురి, బాల్‌రాం పాల్గొన్నారు.