అచ్చంపేట, సెప్టెంబర్ 4: చీకట్లో మగ్గుతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకం అమలు చేశారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో ఆరుగురికి దళితబంధు పథకంలో మంజూరైన రెండు ట్రాక్టర్లు, నాలుగు కార్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలో వందమందికి పథకం అమలు చేశామని, ప్రభుత్వం మరో 1500 మందికి యూనిట్లు కేటాయించిందన్నారు. రాష్ట్రంలోని ఏ వర్గాన్ని విస్మరించకుండా వృత్తులను గౌరవించి పథకాలు అమలు చేస్తూ అండగా నిలబడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఈడీ రాంలాల్, మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, మాజీ చైర్మన్ తులసీరాం, జెడ్పీటీసీ మంత్రియా, ఎంపీపీ శాంతాలోక్యానాయక్, నాయకులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో భారీగా చేరికలు
వంగూరు/ఉప్పునుంతల, సెప్టెంబర్ 4: ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై ఉప్పునుంతలకు చెందిన 10మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరినవారిలో మాజీ వార్డు సభ్యులు బాల్‌రాం, చిట్టెమ్మ, బక్కయ్య, చంద్రమ్మ, చంద్రయ్య, నిరంజన్, సత్తయ్య, వెంకటేశ్, శ్రీను, రాజు, రాధా, పద్మమ్మ తదితరులున్నారు. సమావేశంలో అచ్చంపేట పాలశీతలీకరణ కేంద్రం చైర్మన్ గోపాల్‌రెడ్డి, శ్రీను, ఎల్లయ్యయాదవ్, సుధాకర్, చిన్నజంగయ్య పాల్గొన్నారు.
వంగూరులో..
వంగూరు మండలంలోని సీపీఎంకు చెందిన అన్నారం సర్పంచ్ గౌరమ్మలక్ష్మణ్తోపాటు వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన 100మంది కార్యకర్తలు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సమక్షంలో వారు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమమ్మలాలూయాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ సురేందర్‌రెడ్డి, జెడ్పీ కో-ఆప్షన్ హమీద్, మార్కెట్ డైరెక్టర్ రాజేందర్‌రెడ్డి, కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర్ పాల్గొన్నారు.