జడ్చర్ల, సెప్టెంబర్ 4 : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరంగా మారాయని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్లలోని చంద్రాగార్డెన్‌లో 341 మంది లబ్ధిదారులకు రూ.3.41 కోట్లకుపైగా విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో పేదలు తమ ఆడబిడ్డల పెండ్లిండ్లకు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ వారి కుటుంబాలకు మేనమామగా నిలిచి సాయం అందిస్తున్నారని చెప్పారు. ఇలాంటి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవన్నారు.
పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఆసరా పింఛన్లు అభాగ్యులకు కొండంత అండగా నిలుస్తున్నాయన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు వివరించారు. నిరంతర విద్యుత్, సాగునీటి రాకతో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. మిషన్ భగీరథ నీటి రాకతో మంచినీటి సమస్య దూరమైందన్నారు. 50 ఏండ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రె స్ పార్టీ నేడు అధికారం కోసం పాకులాడుతున్నదని విమర్శించారు. కేంద్ర మంత్రి రేషన్ దుకాణం వద్ద నిలబడే పరిస్థితి వచ్చిందంటే వారి దిగజారుడు తనానికి నిదర్శమన్నా రు. రేషన్ దుకాణంలో ప్రధాని మోదీ ఫొటో లేదని రాద్దాం తం సరికాదన్నారు.
గుజరాత్ సీఎంగా మోదీ ఉన్న సమయంలో నాటి పీఎం మన్మోహన్సింగ్ ఫొటో పెట్టారా..? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, మాజీ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య, డైరెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, ముడా డైరెక్టర్ ఇమ్మూ, పీఏసీసీఎస్ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, మల్లే శ్, సర్పంచులు అశోక్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, నర్సింహులు, శ్రీనివాసులు, కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.