జడ్చర్ల టౌన్, సెప్టెంబర్ 4 : ప్రైవేటు టీవీ చానల్లో సినీహీరో నాగార్జున ఆధ్వర్యంలో ప్రసారమయ్యే బిగ్బాస్ సీజన్-6 షోలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వాసి సాల్మన్ అలియాస్ షానీకి చోటు దక్కింది. పట్టణంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ వరకు అభ్యసించిన ఆయన సినిమాలు, క్రీడలపై ఆసక్తితో హైదరాబాద్కు వెళ్లి స్థిరపడ్డాడు. పలు సినిమాల్లో సాల్మన్కు నటించే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో బిగ్బాస్లో అవకాశం లభించింది. ఆదివారం నుంచి ప్రారంభమైన బిగ్బాస్ సీజన్-6 షోలో పట్టణానికి చెందిన యువకుడు పాల్గొనటంపై కుటుంబ సభ్యులు, మిత్రులు ఆనందం వ్యక్తం చేశారు. బిగ్బాస్ సీజన్-6 టైటిల్ను గెలుపొందేలా ప్రజలందరూ ఓటు వేసి ఆశీర్వదించాలని సాల్మన్ కోరారు.