వనపర్తి, సెప్టెంబర్ 3 : వనపర్తి మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం ఏర్పడిన తరువాత అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వేగంగా పనులు జరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు బల్దియాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ‘మున్సిపాలిటీలో ఎక్కడి సమస్యలు అక్కడే దర్శనమిస్తాయని.., పనులు జరగాలంటే చాలా కాలం పడుతుంది’ అనే నానుడికి విరుద్ధంగా నూతన పాలకవర్గం ఏర్పడిన మూడేండ్లలోనే రూ.కోట్లల్లో అభివృద్ది పనులు చేపట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా, కౌన్సిలర్లు, అధికారుల సమష్టి కృషితో కనీవినీ ఎరుగని తీరులో అభివృద్ధి జరుగుతున్నది. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా మారుస్తున్నారు. ఎందుకూ పనికిరావని గత ప్రభుత్వాలు వదిలివేసిన స్థలంలో నేడు ఆధునీకరణ మార్కెట్ రూపుదిద్దుకుంటున్నది. మున్సిపాలిటీ నిధుల నుంచి రూ.44.86 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో అదనంగా రూ.33 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పట్టణానికి శాశ్వతంగా తాగునీటి కొరత తీరింది. ఆర్అండ్బీ నిధుల నుంచి రూ.49 కోట్లతో హైదరాబాద్ రోడ్డులో జర్రిపోతుల మశమ్మ వాగు నుంచి బాలానగర్ విద్యుత్ కార్యాలయం మీదుగా రాజీవ్‌చౌరస్తా వరకు హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో కొన్ని నిర్మాణ దశలో ఉండగా.. మరికొన్నింటిని ప్రారంభించాల్సి ఉన్నది.
రూ.11 కోట్లతో ఐదు రహదా రుల వెంట 7 కిలోమీటర్ల మేర డ్రై నేజీలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి.
పాలిటెక్నిక్ కళాశాల, అంబేద్కర్ చౌరస్తా, ఎన్టీఆర్ కళాతోర ణం ఎదుట ఉన్న ఫుట్‌పాత్‌లను తొలగించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ఎస్పీ కార్యాలయం వరకు 18, కళాతోరణం వద్ద 12 డబ్బాలను రూ.21 లక్షల తో ఏర్పాటు చేశారు. ఒక్కో డబ్బా కు నెలకు రూ.1500 చొప్పున వసూలు చేస్తూ మున్సిపాలిటీకి ఆదాయాన్ని సమకూరుస్తున్నారు.
మున్సిపాలిటీలో గతంలో 8 పార్కులు ఉండగా.., నూతనంగా కేడీఆర్ నగర్లో రూ.25 లక్షలు, బుడగ జంగాల కాలనీ శాంతినగర్‌లో రూ.20 లక్షలతో పార్కులు ఏర్పాటు చేస్తున్నారు.
జనరల్ ఫండ్ ద్వారా మూడేండ్లలో 33 వార్డులకు కలిపి రూ.4.50 కోట్లతో పనులు చేపట్టారు.
రూ.2 కోట్లతో నాగవరంలో 2, శ్రీనివాసపురంలో 2, నర్సింగాయపల్లిలో ఒకటి ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు.
దాదాపు రూ.2 కోట్లతో పట్టణాన్ని హరితవనంలా మారుస్తున్నారు.
మిషన్ భగీరథ పైప్‌లైన్ ఏర్పాటుచేసే సమయంలో చాలా చోట్ల గుంతలు ఏర్పడాయి. దీంతో బండారు నగర్, కేడీఆర్ నగర్, శంకర్‌గంజ్, మారెమ్మకుంట, వల్లభ్‌నగర్, కమాన్ చౌరస్తా, శ్వేతానగర్, చందాపూర్ రోడ్డు ఇలా మొత్తం ఆరు కిలోమీటర్ల మేర రూ.7 కోట్లతో సీసీ రోడ్లు వేశారు.
గాంధీచౌక్‌లోని కందకం స్థలంలో రూ.5 కోట్ల తో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మిస్తున్నారు. 70 శాతం పనులు పూర్తయ్యాయి.
పాత మార్కెట్‌యార్డు వద్ద రూ.19 కోట్లతో ఇంటిగ్రేటెడ్ క్లాంపెక్స్‌లో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, హెల్త్ కేర్, పిల్లల కోసం పార్కు, క్యాంటీన్, సూపర్ బజార్ ఏర్పాటు చేస్తున్నారు.
గత కౌన్సిల్ సమయంలో రూ.20 లక్షలతో వై కుంఠధామానికి స్థలం, కంపౌండ్ నిర్మించారు. ప్రస్తుత కౌన్సిల్ ఆధ్వర్యంలో రూ.60 లక్షలతో అందమైన ఉద్యానవనంలో వైకుంఠధామం ఏర్పాటు చేశారు. ఇం దులో మూడు శవ దహన వాటికలు, వాచ్మెన్, అస్థికలు భద్రపరిచే గది, శివుడి విగ్రహం, టాయిలెట్లు, స్నానపు గదులు, తాగునీటి వసతి, తలనీలాలు తీసేందుకు ప్రత్యేక స్థలం నిర్మించారు.
కోతులు, కుక్కల సంతానం పెరగకుండా నాగవరం శివారులో రూ.50 లక్షలతో ఎనిమల్ కేర్ సెంట ర్ నిర్మిస్తుండగా.., పనులు తుది దశలో ఉన్నాయి.
నాగవరం, రాజనగరంలో నూతనంగా వైకుంఠధామాలు నిర్మించేందుకు అనుమతులు పంపగా.. ఒ కదానికి పర్మీషన్ వచ్చింది.
చెత్త సేకరణకు గతంలో ఆరు ఆటోలు, ఎనిమిది ట్రాక్టర్లను కొనుగోలు చేయగా.., మరో 10 ఆటో లు, 1 జేసీబీ, 2 ట్యాంకర్లు, వైకుంఠరథాన్ని రూ.2 కో ట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందులో 4 ఆటోలు వచ్చాయి. అన్నీ వచ్చిన తర్వాత వాటిని అందుబాటులోకి తీసుకొస్తారు.
తాళ్ల చెరువు, ట్యాంక్‌బండ్, అమ్మ చెరువులకు 3 కిలోమీటర్ల మేర టఫ్ఐడీసీ ద్వారా రూ.3.80 కో ట్లతో సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. తాళ్ల చెరువు పూర్తి కా గా.. మిగతా చెరువుల వద్ద పనులు జరుగుతున్నాయి.
నాగవరం శివారులో రూ.కోటితో నిర్మిస్తున్న డంపింగ్ యార్డు పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. తడి, పొడి చెత్తను వేరు చేసే మిషన్‌తో సేంద్రియ ఎరువును తయారు చేసి మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చేలా ప్రణాళిక రూపొందించారు.
రాంనగర్ కాలనీలో రూ.5లక్షలు, బాలుర ఉ న్నత పాఠశాల మైదానంలో రూ.20లక్షలు, కేడీఆర్ బసవన్నగడ్డ వార్డులకు కలిపి రూ.10 లక్షలతో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు.
రోడ్ల విస్తరణలో భాగంగా రూ.50 లక్షలతో ఇండ్ల చెత్తను తొలగిస్తున్నారు.
సమీకృత కలెక్టర్ ప్రారంభోత్సవ సమయంలో సీఎం కేసీఆర్ రూ.14 కోట్లను విడుదల చేశారు. కొత్త బస్టాండ్ నుంచి మర్రికుంట వరకు, మెట్పల్లి రోడ్డుతోపాటు పట్టణంలో మిగిలిన డ్రైనేజీలకు సంబంధించి ఎ స్టిమేట్ను తయారు చేసి పంపారు. డిటైల్‌గా ఎస్టిమేట్ రాగానే పనులు ప్రారంభించనున్నారు.
500 మంది కూర్చునేందుకు వీలుగా రూ.7 కోట్లతో టౌన్‌హాల్ పనులు కొనసాగుతున్నాయి.