మహబూబ్‌నగర్, సెప్టెంబ ర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెంచులు, దళితులు ఎక్కువగా ఉండే న ల్లమల అటవీప్రాంతంలో ఉపాధి అవకాశాలు అంతంత మాత్రమే. కాయాకష్టం చేసినా.. ఆర్థికాభివృద్ధి సాధించని అనేక దళిత కుటుంబాలున్నాయి. ఉమ్మడి జిల్లా లో ఎస్సీలకు రిజర్వ్డ్ అయిన అ చ్చంపేట నియోజకవర్గాన్ని గ త పాలకులు నిర్లక్ష్యం చేశా రు. తెలంగాణ వచ్చాక ప రిస్థితులు తారుమారయ్యాయి. ఆ నియోజకవర్గంలోని చారకొండ మండలాన్ని ప్రభుత్వం దళితబంధు పథకం కింద పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. దీంతో అధికారులు మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి 1,367 దళిత కుటుంబాలు ఉన్నట్లు లెక్క తేల్చింది. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున దాదాపు రూ.136 కోట్లు లబ్ధిదారుల ఖాతా ల్లో జమయ్యాయి. దళితులు తాము కోరిన వి ధంగా స్వయం ఉపాధి పొందేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రతి గ్రా మంలో ఉన్న దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తించేలా విప్ గువ్వల బాలరాజు అధికారులను దిశానిర్దేశం చేస్తున్నారు. ఆర్థికంగా ఎదిగేందుకు కావాల్సిన వాటిని సమకూర్చేందుకు జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అన్నీ పూర్తయ్యాక సీఎం కేసీఆర్ చేతులమీదుగా పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ప ట్టుబట్టి మరో 1,500 యూనిట్లను మంజూరు చేయించారు. ఈ పథకం అమలైతే చారకొండ మండల రూపురేఖలే మారుతాయని అంచనా వేస్తున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక అభివృద్ధికి నాంది పలికింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ దళితబంధు పథకా న్ని ప్రవేశపెట్టారు. ఆర్థికంగా వెనుకబడిన వారి కి రూ.10 లక్షలు ఇచ్చి వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా చేయాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్ధేశం. ఈ క్రమంలో చారకొండ మండలా న్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించడంతో దళిత కుటుంబాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి. అధికారులు గ్రామగ్రామాన తిరిగి లబ్ధిదారులను గుర్తించి యూనిట్లపై అవగాహన కల్పించారు. యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయిన వెంటనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.
అచ్చంపేటకు వంద యూనిట్లు..
అచ్చంపేట నియెజకవర్గంలో ఏడు మండలాలకు కలిపి దళితబంధు పథకం కింద వంద యూనిట్లను మంజూరు చేసింది. దీంతో విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అధికారులతో స మన్వయం చేసుకుంటూ లబ్ధిదారులను గుర్తించారు. అచ్చంపేటలోని మినీ స్టేడియంలో వం ద మందికి ట్రాన్స్పోర్ట్, కిరాణం, టెంట్హౌ స్, పేపర్‌ప్లేట్ ప్రొడక్షన్, డెయిరీతోపాటు ఇతర యూనిట్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఆ యా యూనిట్ల ద్వారా నెలకు నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ట్రాక్టర్లకు విరామం లే కుండా పనులు దొరుకుతున్నాయి. ఇక కార్ల యూనిట్లు తీసుకున్న వారు టూర్లకు నడుపు తూ ఉపాధి పొందుతున్నారు. పెండ్లిండ్ల సీజన్ కావడంతో టెంట్‌హౌస్‌లు పెట్టుకున్న వారికి మంచి గిరాకీ దొరికింది. లబ్ధిదారులు యూనిట్లను వినియోగించుకుంటున్నారా..? అని ఆ రా తీసినప్పుడు అధికారులే ఆశ్చర్యపోయేలా అంచనాలకు మించి సక్సెస్ కనిపిస్తున్నది.
మరో 1,500 యూనిట్లు..
దళితబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తు న్నాం. చారకొండ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. 1,400 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగేలా చారకొండ మండల యూనిట్ల పంపిణీని సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభిస్తాం. అన్ని నియోజకవర్గాల మాదిరిగా అచ్చంపేటలో వంద మందికి యూనిట్లను పంపిణీ చేశాం. దళిత కుటుంబాలను మరింత ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరిన వెంటనే 1,500 యూనిట్లు మంజూరు చేశారు. వీటిని కూడా త్వరలోనే పంపిణీ చేస్తాం.
– గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, అచ్చంపేట
సీఎం కేసీఆర్‌పై అభిమానంతో..
అచ్చంపేట మండలం ఐనోలు గ్రామానికి చెందిన కడెం బుచ్చయ్య సీఎం కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. పొలం దున్నాలంటే కిరాయి పెట్టలేక.. తానూ ఓ ట్రాక్టర్ కొనాలనుకున్నా డు. ఆ ఆశయాన్ని దళిత బంధు పథకం తీర్చింది. దీంతో ఆ కుటుంబం ట్రాక్టర్‌పై ఏకంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నాడు. దళితబంధు కింద ట్రాక్టర్ వచ్చిందని గొప్పగా చెప్పుకుంటున్నాడు. ట్రాక్టర్‌తో తన పొలం పనులే కాకుండా.. కిరాయిలకు వెళ్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు.