నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 3 : అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో 1, 7, 6వ స్థాయీ సంఘాల సమావేశాలు శనివారం జరిగాయి. 1, 7 స్థాయీ సంఘాలకు జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షత వహించగా, 6వ స్థాయీ సంఘానికి దామరగిద్ద జెడ్పీటీసీ లావణ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లాస్థాయి అధికారులు సమావేశానికి గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు హాజరు కాకపోతే ఆయా శాఖలకు చెందిన సమస్యలకు సమాధానాలు ఎవరూ చెబుతారని ప్రశ్నించారు. కేవ లం అంకెలతో కూడిన వివరాలతో కాకుండా అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో హాజరు కావాలని ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. నారాయణపేట నుంచి మక్తల్ వెళ్లే రహదారి అధ్వానంగా తయారైందని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే మరమ్మ తు పనులు చేపట్టాలన్నారు. ఆయా సమావేశాల్లో అధికారులు ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. రైతులు ట్రాన్స్ఫారంల కోసం డీడీలు కట్టి ఏడాది అవుతుందని, వెం టనే ట్రాన్స్ఫారంలు మంజూరు చే యాలన్నారు. ధన్వాడ కో ఆప్షన్ స భ్యుడు మాట్లాడుతూ ధన్వాడలో మై నార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల కోసం టెండరై ఆరునెలలు పూర్తయి నా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు ప్రారంభం కాలేదని తెలిపారు.