మరికల్, సెప్టెంబర్ 3 : పేదలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఉచితాలు కావని, ఉచితాలు వద్దంటూ కేంద్ర ప్రభుత్వం అనడం సిగ్గుచేటని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. మండల కేం ద్రంలోని వైఎస్ ఫంక్షన్ హాల్లో నూతనంగా మంజూరైన ఆసరా ఫించన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై 696 మంది ల బ్ధిదారులకు ప్రొసీడింగ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత పథకాలు ఇవ్వొద్దని ప్రధానమంత్రి చెబుతున్నా రాష్ట్రంలో పేదల సంక్షేమానికి సీఎం కే సీఆర్ కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా అమలు కా నీ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. దే శంలో అధికారంలో ఉన్న బీజేపీ అభివృద్ధిని అడ్డుకుంటుందని, కర్ణాటక రాష్ట్రంలో పింఛన్ కేవలం రూ.500 మాత్ర మే ఇస్తుందన్నారు. అదికూడా ఐదునెలలకోసారి ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతినెలా క్రమం తప్పకుండా వృద్ధు లు, వితంతువులకు రూ.2016 పింఛన్లు, దివ్యాంగులకు రూ.3016 ఇస్తున్న ఘనత ప్రభుత్వానిదేనన్నా రు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిచడం తగదన్నారు.
గ్రామాలకు రోడ్డు సౌకర్యం
మండలంలోని ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం క ల్పించామని ఎమ్మెల్యే అన్నారు. లేనిపోని ఆరోపణలు చేసి ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆయన విమర్శించారు. మండలంలో నూతనంగా 696 మంది ల బ్ధిదారులకు పింఛన్లు అందించామన్నారు. మరికల్, పెద్దచింతకుంట గ్రామాల్లో ఎమ్మెల్యే పింఛన్లు పంపిణీ చేశారు.
గుజరాత్ కంటే తెలంగాణలోనే అభివృద్ధి
దేశ ప్రధాని సొంత రాష్ట్రం గు జరాత్ కంటే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే అ న్నారు. గుజరాత్ లో 10 లక్షల మందికి పింఛన్లు ఇస్తే తెలంగాణ లో 40 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తుందన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందనీయకుం డా అడ్డుపడుతుందన్నారు. గుజరాత్లో రెండు రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తే ఇక్కడ ప్రతి ఇంటికీ ప్రతిరోజు పుష్కలంగా మంచినీరు అందిస్తున్నామన్నారు. అభివృద్ధిని అడ్డుకోనే వారిని తరిమికోట్టాలని, అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు.
అభివృద్ధిపై దృష్టిసారించాలి
మండలంలోని నాయకులు అభివృద్ధిపై దృష్టి సారించాలని, పార్టీ కోసం పని చేయాలని ఆయన అన్నారు. పార్టీ లో అంతర్గత కోట్లాటలతో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. మండలంలోని సర్వే నెంబర్ 449లో అడ్డుతగలడంతో ఎంతో నష్టపోతున్నామన్నారు. ఇప్పటికైనా నాయకులు అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత
మండలంలోని ఐదుగురుకి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం సీఎం సహాయ నిధి నుంచి సాయం చేయడం సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, ఎంపీపీ శ్రీకళారెడ్డి, వైస్‌ఎంపీపీ రవికుమార్, ఎంపీటీసీలు సుజాత, గోపాల్, ఎంపీడీవో యశోదమ్మ, మండల కోఆప్షన్ సభ్యుడు మతీ న్, సర్పంచ్ గోవర్ధన్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నా యకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.