మిడ్జిల్, ఆగస్టు 21 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పెద్దఎత్తున మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలోని వేములలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పెంచాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కోరారు. జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, సర్పంచ్ జంగ య్య, ఎంపీటీసీ యశోద, ఎంపీడీవో సాయిలక్ష్మి, ఎంపీవో అనురాధ, పంచాయతీ కార్యదర్శి నరేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, భీంరాజు, వెంకట్‌నారాయణ, శ్రీనివాస్‌గౌడు తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్, ఆగస్టు 21 : నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ కోరారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా స్థానిక తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అలాగే మద్దిగట్లలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, కప్పెటలో వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్ మొక్కలు నాటి నీరు పోశారు. తాటిపర్తి, కొత్తమొల్గర, భట్టుపల్లి, వెల్కిచర్ల, శేరిపల్లి తదితర గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నూరుల్‌నజీబ్, ఆర్ఐ వెంకటేశ్, కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.
బాలానగర్, ఆగస్టు 21 : మండలంలోని చెన్నంగులగడ్డతండాలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జెడ్పీటీసీ కల్యాణి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వాతావరణ పరిరక్షణకోసం ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పెంచాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్, ఆగస్టు 21 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మండలంలోని కౌకుంట్ల, లక్ష్మీపల్లి తదితర గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు స్వప్న, కృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్, ఆగస్టు 21 : మండలకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ ఆవరణలో విద్యార్థినులతో కలి సి ఎంపీడీవో లక్ష్మీదేవి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని సూచించారు. కార్యక్రమం లో సర్పంచ్ బచ్చిరెడ్డి, ప్రిన్సిపాల్ పావని పాల్గొన్నారు.