అచ్చంపేట, ఆగస్టు 8 : కొండాకోనలను ఆవాసంగా చేసుకొని ప్రకృతి మధ్య స్వేచ్ఛగా జీవనం గడుపుతున్న ఆదివాసీల జీవనశైలి క్రమంగా మా రుతున్నది. సమైక్య రాష్ట్రంలో చీకట్లో మగ్గిన చెం చుపెంటలు స్వరాష్ట్రంలో అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాయి. ఆదివాసీల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నది. మౌలిక వసతులు కల్పిస్తున్న ది. అడవిబిడ్డల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రా ధాన్యతమిస్తూనే.. ఇంటి ఆడబిడ్డగా భావించే బౌ రమ్మ తల్లి ఉత్సవాలను ప్రతి ఏటా రూ.10లక్షల నిధులతో అధికారికంగా నిర్వహిస్తున్నది. గిరిజన తండాలు, చెంచుగూడెంలను ప్రత్యేక గ్రామ పం చాయతీలుగా ఏర్పాటు చేసింది. అందరూ కలిసి చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. దీంతో గిరిజన గూడెల్లో ప్రగతి వెలుగులు విరజిమ్ముతున్నాయి. మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
మారిన జీవన విధానం..
సమైక్య రాష్ట్రంలో ఆదివాసీలు చాలా నష్టపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో సున్నిపెంటలో ఉన్న ఐటీడీఏను.. స్వరాష్ట్రంలో చెంచులకు అందుబాటులో ఉండేందుకు అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో ఏర్పాటు చేసి చెంచులకు కావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం సమకూరుస్తున్నది. జీవనోపా ధి, విద్య, వైద్యం, ఉపాధి పథకాలు, రవాణా వ్య వస్థ మెరుగుపర్చడం, సంస్కృతి, సంప్రదాయాల ను కాపాడడంపై ప్రత్యేక దృష్టి సారించింది. చెంచులను పీడిస్తున్న తాగునీటి సమస్యకు చెక్ పెట్టేందుకు రూ.6 కోట్లు ఖర్చుచేసి అన్ని పెంటలకు సో లార్ ద్వారా సింటెక్స్ ట్యాంకులు పెట్టి బోర్ల ద్వా రా తాగునీటిని అందిస్తున్నది. సోలార్లైట్లు ఏ ర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చెంచుల కోసం 120 ఇండ్ల నిర్మాణాలు చేపట్టింది. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు ప్రత్యేకంగా పౌ ష్టికాహారం అందిస్తున్నది. ఇటీవలే ప్రతి చెంచుల ఇండ్లల్లో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఫీవర్ సర్వే నిర్వహించారు.
చెంచులు పూజించే దేవతలు..
చెంచులు బయ్యన్న, పోతురాజు, లింగమ య్య, నాగమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ, బౌరమ్మ, మల్లమ్మ, లక్ష్మమ్మ, మైసమ్మ, గోవుల మైసమ్మ, గా రెల మైసమ్మ, ఆంకాళమ్మ తదితర దేవతలను పూ జిస్తారు. తమ అడవిలో ఉండే జంతువులనే దేవతలుగా భావిస్తారు. పెద్దపులిని పెద్దమ్మతల్లిగా, ఎ లుగుబంటిని లింగమయ్యగా, అడవిపందిని మైసమ్మతల్లిగా, పామును ఎల్లమ్మ, నాగమ్మగా, నల్లపో తు జంతువును పోతరాజుగా, అడవి రేసుకుక్కల ను బౌరమ్మతల్లిగా భావిస్తారు. తేనె తెట్టులో ఉండే తెల్లని గడ్డను మల్లమ్మ దేవతగా నమ్ముతారు. చెం చులు తప్పనిసరిగా శునకాన్ని పెంచుకుంటారు. శు నకాన్ని బౌరమ్మగా భావించడంతోపాటు చీపురు తో కొట్టడం, కాళ్లతో తన్నడం వంటివి చేయరు. శునకం, భార్యాభర్తలు కలిసి వేటకు వెళ్తారు. వారి కట్టుబాట్లు, ఇంటిపేర్లు ప్రత్యేకంగా ఉంటాయి. న ల్లపోతులు, నిమ్మల, డంసాని, చిగుర్ల, మండ్లి, పి ట్టల, చిర్ర, కనుమోని, తొకల, ఉడుతనూరి, కా ట్రాజు, బల్మూరి, దాసరి, శీలం, పులిచెర్ల, బూ మని, ఉడుతల, ఉడుతనూరి తదితర 30 రకాల వరకు వీరి ఇంటి పేర్లు ఉన్నాయి. నిమ్మల, నల్లపోతుల ఇంటివారు అందరినీ పెండ్లి చేసుకోవచ్చు.