నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 8 : దశాబ్దాలుగా వెనుకబడిన దళితుల జీవితాల్లో కొత్త వెలుగు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సుఖజీవన్‌రెడ్డి గార్డెన్స్‌లో నాగర్ కర్నూ ల్ నియోజకవర్గానికి చెందిన దళితబంధు లబ్ధిదారులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మర్రి మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు ద్వారా అందించే రూ.10 లక్షల ఆర్థిక సహాయంతో లబ్ధిదారులు వారికి ఇష్టమైన పరిశ్రమను, ఉపాధిని, వ్యాపారా న్ని ఎంచుకొని మంచి వ్యాపారవర్గంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దళితులు ఆర్థికంగా ఎదగడం కోసమే సీఎం కేసీఆర్ ఈ పథకం అమల్లోకి తె చ్చారని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ నెల 14న అంబేద్కర్ జయంతి రోజున కొంత మంది లబ్ధిదారులకు దళితబంధు యూ నిట్లు అందించేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు జీవితంలో స్థిరపడే వ్యాపారాలను ఎం చుకోవాలన్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 43మంది ట్రాక్టర్ల కొనుగోలుకు దరఖాస్తులు చేసుకున్నారని, ఒకే రకమైన వ్యాపారాలు కాకుండా లాభసాటిగా ఉండే వ్యాపారాలు చేసుకోవాలని కలెక్టర్ లబ్ధిదారులకు సూచించారు. అంతకుముందు జిల్లా అధికారులు లబ్ధిదారులు ఏఏ వ్యాపారాలు చేయవచ్చు, ఎలా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కల్పనా భాస్కర్‌గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాంలాల్, పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ రమేశ్, పరిశ్రమలఅధికారి హనుమంతు, ఆర్టీవో ఎర్రిస్వామి, డీఆర్డీవో నర్సింగరావు, వ్యవసాయశాఖాధికారి వెంకటేశ్వర్లు, ఎంపీపీ నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ శ్రీశైలం, తెలకపల్లి ఎంపీపీ మధు, బిజినేపల్లి ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.