మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓటర్లను ప్రలోభపెట్టి మద్యం, డబ్బులు విచ్చలవిడిగా పంచి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కొనుగోలు చేసినా చాలా చోట్లా అధికార పార్టీకి ఎదురు దెబ్బలే తగిలాయి.. అధికార పార్టీకి దీటుగా నిలిచేది బీఆర్ఎస్సేనని ప్రజలు విలక్షణ తీర్పునిచ్చారు. బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయ పార్టీగా పాలమూరు జిల్లా ప్రజలు భావించారు. బీజేపీని దరిదాపుల్లో కూడా రానివ్వలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ రెండు చోట్ల స్పష్టమైన మెజారిటీతో మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా.. హంగ్ వచ్చిన మరో మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. సీఎం సొంత నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ గట్టి పోటీని ఇచ్చింది. కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించి ఎత్తుకెళ్లినా.. ఓటర్లు మాత్రం బీఆర్ఎస్నే ఆదరించారు. కొడంగల్ మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ ఒక వార్డులో విజయకేతనం ఎగురవేసింది. మహిళ అభ్యర్థి చేతులో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలు కావడం చర్చనీయాంశంగా మారింది. మద్దూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్తో హోరాహోరీగా తలపడాల్సి వచ్చింది. కోస్గిలోని నాలుగో వార్డు అభ్యర్థిని ఎత్తుకెళ్లి ప్రచారం చేయకుండా చేసినా.. 139 ఓట్లు బీఆర్ఎస్కు ఆ వార్డులో పడ్డాయి అంటే బీఆర్ఎస్పై ఉన్న అభిమానాన్ని అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ అనేక అపసోపాలు పడి చావు తప్పికన్నులొట్ట పోయినట్టుగా అప్రజాస్వామిక పద్ధతిలో మున్సిపాలిటీలో గెలిచింది. ఇదే ప్రజాతీర్పు అనుకొని సంకలు గుద్దుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క మున్సిపాలిటీని కూడా గెలుచుకోలేకపోయింది. బీజేపీ ఒక మున్సిపాలిటీని గెలుచుకోగా ఇప్పుడు కూడా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. బీఆర్ఎస్ పోటీ చేసిన ప్రతిచోటా అనేక నిర్బంధాలు పెట్టినా.. గట్టి పోటీ ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో ఓడి కేవలం ప్రలోభాలే వారిని గెలిపించాయి.
జోగుళాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ కీలకమైన రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, పార్టీ నాయకత్వం సమిష్టిగా కృషి చేయడంతో అయిజ, అలంపూర్ మున్సిపాలిటీలో దు మ్మురేపింది. మాజీ ఎమ్మెల్యే సంపత్ కు చెంప చెల్లుమనిపించాయి. ఇక ఆయన సొంత పట్టణ ంలో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు గెలిచారు. అలంపూర్ నియోజకవర్గం మరోసారి కారుకే జై అంది. అలంపూర్ మున్సిపాలిటీలో 10 వార్డులకు గానూ ఐదు వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక అయిజలో మొత్తం 20 వార్డుల్లో 13 బీఆర్ఎస్ గెలుపొందగా ఏడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ రెబల్స్ 8 చోట్ల గెలుపొందగా బీఆర్ఎస్ ఒకచోట గెలుపొందింది. అయితే బీఆర్ఎస్లో టికెట్ ఆశించి ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీఫామ్స్ తెచ్చుకొని పోటీ చేశారు. అయితే వీరు తెలంగాణ జాగృతిలో చేరినట్లు వచ్చిన ఆరోపణలు ఖండించారు. తాము ఏ పార్టీలో చేరలేదని అవసరమైతే బీఆర్ఎస్కే మద్దతు తెలుపుతామని వడ్డేపల్లి నాయకులు ప్రకటించారు.
వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ మక్తల్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యాక పది వార్డులకు గానూ బీఆర్ఎస్ మూడు, కాంగ్రెస్ మూడు, బీజేపీ మూడు, సీపీఎం ఒక వార్డును గెలుచుకున్నాయి. అయితే ఇక్కడ హంగ్ ఏర్పడడంతో వెంటనే మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి చక్రం తిప్పి బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు వార్డు కౌన్సిలర్లతో కలిసి మున్సిపాలిటీని కైవసం చేసుకోనున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్లను పార్టీ శ్రేణులు క్యాంపునకు తరలించారు.
గద్వాల మున్సిపాలిటీలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మున్సిపాలిటీలో ప్రజాతీర్పు వ్యతిరేకంగా వచ్చిన పోలీసు యంత్రాంగాన్ని ఎన్నికల అధికారులను బెదిరించి దౌర్జన్యకాండకు పాల్పడి మున్సిపాలిటీని హస్తగతం చేసుకునే దిశగా ప్రయత్నించడం పలు విమర్శలకు తావిచ్చింది. ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ అభ్యర్థి ఒక్క ఓటుతో గెలిచారు. మేజిక్ ఫిగర్‌కు ఇంకా నాలుగు స్థానాలు ఉండగా ఇద్దరు ఇండిపెండెంట్లు.. మరో ఇద్దరు అభ్యర్థులను బలవంతంగా క్యాంప్‌నకు ఎత్తుకెళ్లారు. బీఆర్ఎస్ గెలిచేనా రీకౌంటింగ్ చేసి దౌర్జన్యంగా అక్కడ కాంగ్రెస్ గెలిచినట్లు ప్రకటించుకొని తీసుకెళ్లారు. అధికార యంత్రాగం ఈ అనైతిక చర్యలకు సహకరించడం చర్చనీయాంశమైంది. మొత్తంపైన అధికార పార్టీ అడ్డదారులతో గెలిచేందుకు చేసిన ప్ర యత్నాలు కళ్లకు కట్టినట్లుగా మున్సిపల్ ఎన్నికలు నిలిచాయి.
కొల్లాపూర్ మున్సిపాలిటీలోని 19 వార్డులకు జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ 16 వార్డుల్లో, బీఆర్ఎస్ మూడు వార్డుల్లో గెలిచింది. అయితే 2వ వార్డులో జయలక్ష్మి ఒక్క ఓటుతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే ఇదే వార్డులో ఒక బ్యాలెట్ పేపర్ కనపడకుండా పోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. దీంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కుమ్మరి పద్మ రీకౌంటింగ్‌కు డిమాండ్ చేయడంతో మళ్లీ లెక్కించిన ఎన్నికల అధికారులు చెల్లని ఓట్లపై పడిన కొలతను కూడా సరిగ్గా లెక్కించలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కనపడబకుండా పో యిన బ్యాలెట్ పేపర్‌పై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నైతికంగా బీఆర్ఎస్ గెలిచినా దొంగ దారిలో కాంగ్రెస్ గెలిచినట్లు ప్రకటించుకున్నారని విమర్శించారు. అధికార బలం తో కాంగ్రెస్ దొంగ ఓట్లు, బీఆర్ఎస్ నాయకులను బెదరింపులకు గురిచేయడంతో పాటు, భారీ మొత్తంలో డబ్బు, మద్యం పంపిణీ చేసి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
భూత్పూర్, ఫిబ్రవరి 13 : దేవరకద్ర నియోజకవర్గంలోని వివిధ మున్సిపాలిటీల్లో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు గడ్డం ప్రేమ్‌కుమార్, కొండల్, యుగంధర్‌రెడ్డి, మాధవీయుగంధర్లను మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అభినందించారు. అభినందించిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్ష,కార్యదర్శులు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సత్తూర్ నారాయణగౌడ్, నాయకులు నామునాయక్, సత్యనారాయణ, అశోక్‌గౌడ్, రెడ్యానాయక్, కొండ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
కొల్లాపూర్ రూరల్, ఫి బ్రవరి 13 : కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి అధికారాన్ని అ డ్డం పెట్టుకొని డబ్బులు, మ ద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసి ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో గెలుపొందారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపిం చారు. బుధవారం కొల్లాపూ ర్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల పలితాలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ని బంధనలు ఉల్లంఘించి అధికార వాహనాలను వాడుతూ పోలీసులను వెంబడి వేసుకొని ప్రతి వార్డులో ఇంటిఇంటికీ తిరుగుతూ ప్రజలను అయోమయానికి గురిచేసి ఎన్నికల్లో గెలుపొందారని మండిపడ్డారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా నైతిక విజయం మాత్రం బీఆర్ఎస్ పార్టీదేనని పేర్కొన్నారు.
