నారాయణపేట టౌన్, ఆగస్టు 17 : రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కలెక్టర్ హరిచందన అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పట్టణంలోని జిల్లా దవాఖానలో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో దాతలిచ్చిన రక్తం ప్రాణాలను నిలబెడుతుందన్నారు. రక్తదాన ఆవశ్యకతను గుర్తించిన సీఎం కే సీఆర్ వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో ఒకరోజు రక్తదానానికి కేటాయించడం జరిగిందన్నారు. జిల్లాలో ని ప్రతి నియోజకవర్గంలో 75 మంది రక్తదాతలు రక్తదానం చేసేలా ఏర్పా ట్లు చేశామన్నారు.
రక్తదానంలో పా ల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, డీఎంహెచ్ వో రాంమనోహర్‌రావు, సూపరింటెండెం ట్ రంజిత్, పౌరసరఫరాల శాఖ అధికారి శివప్రసాద్, ఆర్డీవో రాంచందర్, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, ఇండియన్ రెడ్‌క్రాస్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ అర్బన్, ఆగస్టు 17 : దేశ నాయకులను గుర్తు చే సుకోవాలని ఎంపీపీ వనజ అన్నారు.
పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో ఊట్కూర్ ఎస్సై రాములు, పోలీస్ సి బ్బంది, వైద్య సిబ్బంది రక్తదానం చేశా రు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రోగులపై నిర్ల క్ష్యం చేయరాదన్నారు.
కార్యక్రమంలో నోడల్ అధికారి శైలజ, సీఐ సీతయ్య, మక్తల్ ఎస్సై పర్వతాలు, వైద్య సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.