జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 14: జాతీయస్థాయిలో వివిధ పోటీ పరీక్షల్లో రాణించేందుకు విద్యార్థులు హిందీ భాషపై ప్రావీణ్యం పెంచుకోవాలని జడ్చర్ల ఎంఈవో మంజులాదేవి అన్నారు. జాతీయ హిందీభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం బాదేపల్లి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ హిందీభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో, భారతీయ సమత హిందీ ప్రచార పరిషత్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కడమంచి చెన్నయ్య మాట్లాడారు.
ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీ రెండోస్థానంలో ఉన్నదన్నారు. విద్యార్థి దశ నుంచి హిందీపై పట్టు సాధించాలన్నారు. అనంతరం హిందీ పండిట్లను శాలువాతో సత్కరించారు. దాతల సహకారంతో హిందీ వ్యాకరణ పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. అలాగే పెద్దఆదిరాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో హిందీ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
వేర్వేరు కార్యక్రమాల్లో పాఠశాల హెచ్వోడీ వివేకానంద, అబ్దుల్బాసిత్, ఫర్జానా సుల్తానా, బసవయ్య, శివకుమార్, పెద్ద ఆదిరాల హెచ్ఎం యుగంధర్, ఉపాధ్యాయులు తాహేర్, శ్రీదేవి, ఆనందం, అనురాధ, నర్సింహులు, మధు, నార్యానాయక్, లక్ష్మీశ్యాంసుందర్, వెంకటయ్య, కృష్ణానాయక్, భాస్కర్, శ్రీదేవి, భూదేవి తదితరులు పాల్గొన్నారు.