Mahabubnagar | మహబూబ్ నగర్ కలెక్టరేట్, జూన్ 22 : నాల్గవ తరగతి ఉద్యోగుల సంక్షేమమే నూతన కార్యవర్గ ధ్యేయం అని రాష్ట్ర ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ.నరేందర్ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం భవనంలో నిర్వహించిన సహకార గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్, మహబూబ్ నగర్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికల్లో అధ్యక్షుడుగా విజయం సాధించిన అనంతరం మాట్లాడారు. ఆర్థిక పరపతి రంగాల్లో సహకార వ్యవస్థ ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగులకు వివిధ పరిష్కార మార్గాలు చూపనుందన్నారు. సంఘంలోని సభ్యులకు ఆర్థికంగా, సామాజికంగా అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ప్రతి కుటుంబానికి గృహం ఉండేలా తమ కార్యాచరణ ఉండబోతోందని, ఉద్యోగులకు తగిన సౌకర్యాలను కల్పిస్తామని పేర్కొన్నారు. నూతన కార్యవర్గాన్ని కలెక్టరేట్ ఏవో శంకర్, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, మహబూబ్ నగర్ అర్బన్ మండలం డిప్యూటీ తహశీల్దారు డేవేందర్ కెసిరెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు అభినందించారు.
జిల్లా నూతన కార్యవర్గం
ప్రభుత్వ నాల్గో తరగతి ఉద్యోగుల కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్, మహబూబ్ నగర్ జిల్లా ఎన్నికలకు జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.రాజశేఖర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అధ్యక్షుడుగా ఏ.నరేందర్, ఉపాధ్యక్షుడుగా పి.రఘురాం, కార్యదర్శిగా తిరుమలగిరి రామకృష్ణ, రెరెక్టరుగా ఎలమ్మ, జి.అన్నపూర్ణ, జి. అన్నపూర్ణ, భాగ్యలక్ష్మీ, కొడావత్ మౌనిక, జి.రాజు, కార్యవర్గ సభ్యులుగా జి.అన్నపూర్ణ, ఎల్లమ్మ, కోడావత్ మౌనిక, తిరుమల రామకృష్ణ, ఏ.నరేందర్, భాగ్యలక్ష్మీ, పి.రఘురాం, టి.రాజశేఖర్ జి.రాజును ఎన్నుకున్నారు. ఈ సంఘం కాలపరిమితి 5 సంవత్సరాలు ఉంటుందని ఎన్నికల అధికారి పేర్కొన్నారు.