
మహబూబ్నగర్, జూన్ 28 : అడవుల సంరక్షణ, పునరుద్ధరణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో నిర్వహించిన జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అడవుల నుంచి కలప అక్రమ రవాణాను అరికట్టడంతోపాటు అటవీ భూముల సంరక్షణ, అడవులను పునరుద్ధరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అటవీ భూములను సం రక్షించేందుకుగానూ అటవీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు సం యుక్త బాధ్యత తీసుకోవాలన్నారు. కలప అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసులు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ వెంకటేశ్వర్లుకు సూచించారు. ప్రభుత్వం పచ్చదనం పెం పొందించేందుకు చేపట్టిన హరితహారంలో పెద్దఎత్తున మొక్కలు నాటి పెంచాలన్నారు.
మహిళా స్వయం సహాయక సంఘాల స భ్యులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా గతేడాది కోటీ 18లక్షల విత్తన బంతులు, ఈ ఏడాది 2 కోట్ల 8 లక్షల వి త్తన బంతులు తయారు చేసినట్లు తెలిపారు. 2 కోట్ల విత్తన బం తులను చల్లినా కనీసం 54 శాతం మొలకెత్తుతాయన్నారు. పోలీ సు అధికారులు హరితహారంలో భాగస్వాములై పెద్దఎత్తున మొ క్కలను నాటాలన్నారు. అనంతరం ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎస్సైలు, తాసిల్దార్లు సమన్వయంతో ఉండాలని, ముఖ్యంగా అన్ని పోలీస్స్టేషన్లలో ఇసుక ఎన్ఫోర్స్మెంట్ రిజిస్టార్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇసుక అనుమతులు వచ్చినప్పుడు తాసిల్దార్లు ఒక కాపీని సబ్ ఇన్స్పెక్టర్కు పంపించాలని, మైనింగ్ శాఖ నుంచి కూడా ఒకరిని ఎన్ఫోర్స్మెంట్ బృందంలో ఉంచాలని తెలిపా రు. రెవెన్యూ, పోలీస్ సమన్వయంతో అక్రమ ఇసుక రవాణాను అరికట్టవచ్చన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, మైనింగ్ ఏడీ విజయ్, ఆర్డీవో పద్మశ్రీ పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం
నకిలీ విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతామని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయించేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే పీడీ యాక్డు నమోదు చేయాలన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకుగానూ జిల్లా, డివిజన్, మండల స్థాయిలో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో తాసిల్దార్, వ్యవసాయ శాఖ అధికారి, సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారని, డివిజన్ స్థాయిలో డీఎస్పీ, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు, ఆర్డీవో ఉంటారని తెలిపారు. జిల్లా స్థాయిలో తనతోపాటు జిల్లా వ్యవసాయాధికారి, ఎస్పీ ఉంటారని కలెక్టర్ తెలిపారు. బృందంలో వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ రెవెన్యూ సహాయకులు, గ్రామ పోలీస్ అధికారులు ఉంటారన్నారు. నకిలీ విత్తనాల విక్రయాన్ని అడ్డుకునేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. వీసీలో జిల్లా వ్యవసాయాధికారి సుచరిత, ఆర్డీవో పద్మశ్రీ, ఆత్మ పీడీ హుక్యానాయక్, డీఎఫ్వో గంగిరెడ్డి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, వ్యవసాయాధికారులు, తాసిల్దార్లు తదితరు లు పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రస్తుతం ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతి ఇవ్వడంలేదన్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇకపై జిల్లా నుంచి ఇసుక అక్రమంగా రవాణా కావడానికి వీలులేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు 24గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బాలానగర్, రాజాపూర్, మహబూబ్నగర్ రూరల్ తదితర ప్రాంతాల నుంచి ఫిల్టర్ ఇసుక రవాణాను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ సీతారామారావు, మైనింగ్ శాఖ ఏడీ విజయ్, ఆర్డీవో పద్మశ్రీ తదితరులు ఉన్నారు.
అంకితభావంతో పని చేయాలి
అభివృద్ధి కార్యక్రమాలను అంకితభావంతో నిర్వహించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమ్మిళిత సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. హరితహారం కార్యక్రమాన్ని పక్కాగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. యాదాద్రి తరహాలో మొక్కలు నాటి పెంచాలన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో 6 మొక్కలు నాటాలన్నారు. జూలై 1 నుంచి 10వ తేదీ వరకు పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేకాధికారులు పల్లెప్రగతిపై 30న మండల స్థాయిలో సమావేశం నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలన్నారు. నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభం తర్వాత అన్ని శాఖలు అక్కడి నుంచే పని చేయాలని ఆయన సూచించారు. పాత కార్యాలయాల స్థలాలు కలెక్టర్కు అప్పగించాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, డీఆర్వో స్వర్ణలత, జెడ్పీ సీఈవో జ్యోతి, వైద్య కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.