
మరికల్, ఆగస్టు 14 : రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధే య్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్త్తుందని ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఎక్లాస్‌పూర్‌లో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయం, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పల్లెను అభివృద్ధి చేయడమే ప్రభు త్వ ధేయ్యమని, పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఎంతోగానో కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. త్వ రలోనే 57 ఏండ్ల వారికి పింఛన్ వస్తు ందన్నారు. ప్రతిఒక్కరూ కచ్చింతగా క రోనా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. అనంతరం పల్లె ప్రకృతి వనంలో ఎమ్మెల్యే మొక్కలను నాటారు. ప్రతి మొ క్కనూ సంరక్షించుకోవాలన్నారు. గ్రామ అభివృద్ధి కో సం ఎంపీపీ శ్రీకళారాజవర్ధన్రెడ్డి తన నిధుల నుంచి రూ.8 లక్షలు విడుదల చేశారు. కా ర్యాక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖారెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్ యాదవ్, స ర్పంచ్ పద్మమ్మ, ధన్వాడ సింగల్‌విండో చై ర్మన్ వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ నర్వ మం డల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, ఉపసర్పంచ్ బాబు, నాయకులు పాల్గొన్నారు.
కృష్ణ, ఆగస్టు 14 : మండలంలోని ఆలంపల్లి గ్రామం నుంచి చేగుంట, కున్సి గ్రామలకు రూ.5 కోట్ల వ్యయంతో బ్రిడ్జితోపాటు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ వ నజాగౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పం చ్ ఆధ్వర్యంలో ప్రజలు శాలువా, పూలమాలతో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సం క్షేమమే ధ్యేయంగా రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు దూ సుకెశ్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, ఎంపీపీ పుర్ణిమ, జెడ్పీటీసీ అంజనమ్మ, సర్పంచ్ రామకృష్ణ, టీఆర్ఎస్ కృష్ణ, మాగనూర్, మక్తల్ మండలాల అధ్యక్షులు విజయపాటిల్, ఎల్లారెడ్డి, మహిపాల్‌రెడ్డి, సింగల్ విండో చైర్మ న్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారు లు తదితరులు పాల్గొన్నారు.