e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home జిల్లాలు స్వరాష్ట్ర సాధన కోసం నినదించిన గొంతుక

స్వరాష్ట్ర సాధన కోసం నినదించిన గొంతుక

స్వరాష్ట్ర సాధన కోసం నినదించిన గొంతుక

ఉద్యమమే ఊపిరిగా పని చేసిన పత్రిక
స్వరాష్ట్ర సాధనతో పాటు అభివృద్ధిలోనూ కీలక పాత్ర
నేడు ‘నమస్తే తెలంగాణ’ పదో వార్షికోత్సవం

మహబూబ్‌నగర్‌, జూన్‌ 5 (నమస్తే తెలంగాణ, ప్రధాన ప్రతినిధి): నమస్తే తెలంగాణ… తెలంగాణ గుండె చప్పుడు. 2010 జూన్‌ 6న పురుడు పోసుకున్న తెలంగాణ వాణి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను, ఆంధ్ర నాయకుల చేతుల్లో పడుతున్న బాధలను, మన వనరులను తరలించుకుపోతున్న సమైక్య పాలకుల దుర్నీతిని, మన నీళ్లు మన నిధులు మన నియామకాలను కైవసం చేసుకుని మనమీద పెత్తనం చేస్తున్న సమైక్య వాదుల కుట్రలను ఎలుగెత్తి చాటింది ’నమస్తే తెలంగాణ’. అప్పటివరకు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడే ఒక్క దిన పత్రిక కూడా లేని పరిస్థితుల్లో నమస్తే తెలంగాణ సగర్వంగా ముందుకు వచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. తెలంగాణపై ఆంధ్ర పాలకులు సాగిస్తున్న దురాగతాలను, అణచివేతను ప్రపంచం దృష్టికి తీసుకు పోయింది. ఉద్యమ నేత కేసీఆర్‌ సాగించిన పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచింది. స్వరాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమకారుల పోరాటాన్ని ఏ పత్రిక కూడా ప్రధానంగా ప్రచురించని రోజుల్లో నేనున్నానంటూ నమస్తే తెలంగాణ ఉద్యమ గొంతుకగా మారింది. తెలంగాణ సాధనే లక్ష్యంగా పని చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీకి, ఉద్యమకారులకు వెన్నుదన్నుగా నిలిచింది. సమైక్యవాదులు నమస్తే తెలంగాణపై ఎన్ని కుట్రలు చేసినా నిలబడి పోరాడింది. చివరకు 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు రాష్ట్ర ప్రజలందరి తరపున నమస్తే తెలంగాణ పులకించిపోయింది. ఉద్యమం కోసం స్వరాష్ట్రం కోసం పోరాడిన నమస్తే తెలంగాణ ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో పునరంకితం అయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజా సమస్యలను వెలికి తీస్తూ… ముందుకు సాగింది. ధర్మగంట పేరిట రెవెన్యూ అధికారులు సాగిస్తున్న అరాచకాలపై గొంతెత్తి పోరాడింది. ధర్మగంట ద్వారా అనేకమంది భూ సమస్యలు తీర్చేందుకు నమస్తే తెలంగాణ కృషి చేసింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచింది. భవిష్యత్తులోనూ ఇదే ఒరవడితో ముందుకు సాగుతూ తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలబడనుంది.

సెప్టెంబర్‌ 20,2011
సకల జనుల సమ్మె సందర్భంగా మహబూబ్‌నగర్‌లో రోడ్లపైకి వచ్చిన సామాన్యులు, మేధావులు, ఉద్యోగులు,
డిసెంబర్‌ 9,2012
పాలమూరు విశ్వవిద్యాలయంలో ‘డిసెంబర్‌9’ అంశంపై నమస్తే తెలంగాణలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చర్చావేదిక
ఫిబ్రవరి 3,2013
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పల్లెవికాసం’ కార్యక్రమం మహబూబ్‌నగర్‌ జిల్లాలో అమలుకాని తీరును ఎండగడుతూ రాసి కథనం
నవంబర్‌ 20,2013
నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతం, సోమశిల-శ్రీశైలం లాంచి ప్రయాణం, కృష్ణానదీ తీరంలోని చీమలతిప్ప, అక్కమహాదేవి గుహలు, మరెన్నో పర్యాటక ప్రాంతాలను సాహసోపేతంగా మరబోటులో ప్రయాణించిన అన్వేషించి, ప్రచురించి ప్రభుత్వానికి, పర్యాటక శాఖకు ‘నమస్తే తెలంగాణ ’ బృందం అప్పగించిన కథనాలు.
ఫిబ్రవరి13,2014
నమస్తే తెలంగాణ దినపత్రిక ఆధ్వర్యంలో అమరుల కుటుంబాలతో ఏర్పాటు చేసి వారికి భరోసానిచ్చి ఆర్థికసాయం అందజేసిన సందర్భం.
జూన్‌ 3,2014
స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిన వేళ యావత్‌ తెలంగాణ ఆత్మగౌరవం తలెత్తుకుని నిలబడిన సందర్భం..మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా
ఆవిర్భావ సంబురాలు చేసుకుంటున్న ప్రత్యేక కథనం..
జూన్‌ 12,2015
స్వరాష్ట్రంలో ప్రాజెక్టుల పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు పారించడమే లక్ష్యంగా గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన
సీఎం కేసీఆర్‌
అక్టోబర్‌ 13,2016
స్వరాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ప్రచురితమైన కథనం
జూన్‌30,2018
జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు ఎత్తిపోతల పథకం శంకుస్థాపనకు సీఎం కేసీఆర్‌ విచ్చేసిన సందర్భంగా ప్రచురితమైన కథనం
మే 16,2019
భూసమస్యలపై రెవెన్యూ అధికారుల వేధింపులను ఎండగడుతూ ‘ధర్మగంట’ పేరున ప్రత్యేక కథనాలు ప్రచురించి
బాధితుల పక్షాన నిలిచిన సందర్భం..
మే24,2021
కరోనా వైరస్‌పట్ల జనాలకు భయభ్రాంతులకు గురిచేస్తూ మీడియాల్లో ప్రచురితమైన వార్తల నుంచి ప్రజలకు పోగొట్టేలా ప్రచురితమైనకథనం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్వరాష్ట్ర సాధన కోసం నినదించిన గొంతుక

ట్రెండింగ్‌

Advertisement