మహబూబ్‌నగర్ టౌన్, జూన్ 6 : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు దోహదపడుతాయని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. అందుకే పల్లెలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన స్టేడియంలో రూ.40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్‌పూల్, బాస్కెబాల్ కోర్టు, ఆర్బరీ రేంజ్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం రూ.7.09 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆట స్థలాలు ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పల్లె, పట్టణ ప్రగతిలో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా ప్రాంగణా లు ప్రారంభించినట్లు తెలిపారు.
జిల్లా కేంద్రంలో కనీసం వాకింగ్ ట్రాక్ ఉండే ది కాదని, అలాంటిది ప్రధాన స్టేడియం లో ఇండోర్ స్టేడియంతోపాటు క్రీడా కోర్టులను ఏర్పాటు చేశామని చెప్పారు. భవిష్యత్తులో జిల్లా క్రీడాకారులు జాతీ య క్రీడలు ఆడేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మల్టీపర్పస్, ఇండోర్ స్టేడి యం, వాకింగ్ ట్రాక్, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్ మైదానం, వాలీబాల్, హ్యాండ్‌బా ల్, కబడ్డీ, ఖోఖో కోర్టుల పనులు 90 శా తం పూర్తయినట్లు వివరించారు. ఎంవీఎస్ ఆవరణలో మరో కొత్త స్టేడియం ఏర్పాటు చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఎంవీఎస్, భూత్పూర్ వద్ద స్టేడియాల నిర్మాణానికి రూ.17.21 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానం నిర్మిస్తామని స్ప ష్టం చేశారు. దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూరులో నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, మార్కెట్ కమి టీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, ముడా చైర్మన్ గంజివెంకన్న, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, క్రీడాశాఖ జిల్లా అధికారి శ్రీనివాస్, కౌన్సిలర్ రామ్, కట్టా రవికిషన్‌రెడ్డి, పటేల్ ప్రవీణ్, గోవిందు, నాయకులు జగన్మోహన్గౌడ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
పనుల్లో వేగం పెంచాలి
పాలమూరు జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్‌లో చేపట్టిన ఐలాండ్, సస్పెన్షన్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. సోమవారం పట్టణంలోని మినీట్యాంక్‌బండ్ నిర్మాణం లో ఉన్న పనులను మంత్రి తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్నందున పెద్ద చెరువులో పూడికతీత పనుల్లో వేగం పెంచాలన్నారు. అవసరమైతే లేబర్, యంత్రాలను ఉపయోగించి చకచకా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌ను మంత్రి ఆదేశించారు. వర్షపు నీరు చెరువులో చేరకుండా చూడడంతోపాటు మురుగు చెరువులోకి రాకుండా పట్ట ణం బయటకు పంపించేలా చర్యలు తీ సుకోవాలని అదనపు కలెక్టర్ తేజస్ నం దలాల్ పవార్‌కు సూచించారు.