మాగనూరు : రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ( State-level cricket ) మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి సిద్ధార్థ ( Siddhartha ) ఎంపికైనట్లు విద్యార్థి తండ్రి వర్కూర్ నరసింహ తెలిపారు. ఈ నెల 14,15వ తేదీలలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అండర్ 14 క్రికెట్ ఎంపికలను మోస్తల్లో నిర్వహించారు.
మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏడో తరగతి చదువుతున్న సిద్ధార్థ రాష్ట్రస్థాయి అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడని తెలిపారు. డిసెంబర్లో భద్రాచలంలో జరిగే అండర్ 14 క్రికెట్ పోటీలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన సిద్ధార్థ ను నారాయణపేట జిల్లా విద్యాధికారి గోవిందరాజు, మాగనూరు ఎంఈవో మురళీధర్ రెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు.