పాలమూరు, నవంబర్ 22 : మహబూబ్‌నగర్ బుధవారం బాలుర మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వద సభలో సాంస్కృతిక కార్యక్రమాలు నాయకులు, కార్యకర్తలను హుషారెత్తించాయి . ఈ సభలో గాయని మధుప్రియ, శివజ్యోతి, బిత్తిరి సత్తి, మానుకోట ప్రసాద్ రకరకాల జానపద, తెలంగాణ యాస పాటలతో సభ మొత్తాన్ని అలరించారు. అదే విధంగా సభకు కుడి వైపున జానపద కళాకారులు రకరకాల నృత్యాలతో అలరించారు. సీఎం కేసీఆర్ వచ్చేంత వరకు ప్రజా ఆశీర్వాద సభలో పాటలకు ప్రజలు. నాయకులు, కార్యకర్తలు నృత్యాలు చేశారు. సభలో కారుగుర్తుకు మద్దతుగా జనసముహంలోని ప్రజలు ఒక్కసారిగా తెలంగాణ పా టలకు చిందులేశారు. సభ ప్రాంగణం మొత్తం పాటలతో దద్దరిల్లింది. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పాటల రూపంలో గాయని మధుప్రియ ఎంతో చక్కగా వివరించింది. అదే విధంగా శివజ్యోతి/సావిత్రి తెలంగాణ యాసలో ప్రభుత్వం పనితీరును సభకు వచ్చిన ప్రజలకు చక్కగా వివరిస్తూ ఆకట్టుకుంది. బిత్తిరి సత్తి తనదైన శైలిలో సభలోని ప్రజలల్లో చైతన్యాన్ని నింపాడు. గత కాంగ్రెస్ పాలనలో పడ్డ కష్టాలను ఆట, పాటలతో ప్రజలకు అర్థమైయ్యే విధంగా వివరించారు. కార్యక్రమంలో కళాకారులు బృందం, కళాకారులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌ను ఎంతో అభివృద్ధి చేసిండు రోడ్లు, చెట్లు, లైట్లు ఇంతవరకు ఎవరూ చేయలేదు. నాకు తొలిసారి ఓటు హక్కు వచ్చింది. ఇప్పు డు మొదటి ఓటు శ్రీనివాస్‌గౌడ్‌కే వేస్తాను. ఇంకా అభివృద్ధి చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికే వస్తాయని, అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయని సీఎం కేసీఆర్ చెప్పారు. అందుకే బీఆర్ఎస్కే నా ఓటు
మళ్లీ మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అ వుతాడు. మా కష్టాలు తీర్చిండు, కేసీఆర్ సీఎం అయ్యాకా కరెంట్ మంచి గా ఉంటుంది. అందుకే నాకు న్న రెం డు ఎకరాల్లో వరివేశాను..కేసీఆర్ మాట లు విందామని వచ్చాను. గతంలో రాత్రి వేళ్లల్లో రైతు లు కరెంట్ షాక్, పాములు, తేల్లు కరిచి చని పోయారు అన డం తో ఆయన మాటలో నిజమే ఉందని అనిపించిం ది.అందుకే మా ఇంటి ఓట్లు అన్ని కేసీఆర్, శ్రీనివాస్ గౌడ్‌కే వేస్తాం.
సభలో జనాన్ని చూసి చాలా సంతో షం అనిపించింది. రైతుబంధు, పింఛన్ వంటి మంచి పనులు చేస్తున్నాడు మన కేసీఆర్ సార్. వచ్చే నెల నుంచి పింఛన్ రూ.5,016 ఇస్తామంటున్నా డు. మాకు కేసీఆర్ సర్కారుపై నమ్మకం ఉంది. కారు గుర్తు మీద ఓటు వేస్త్తే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతడు. మా సీనన్న పాలమూరు అభివృద్ధిలో ముందుకు పోతడు.
గతంలో రెండు వందల పింఛన్ సరిపోయేవి కావు బిడ్డ, ఇప్పుడు కేసీఆర్ నెలనెల రెండు వేల పింఛన్ ఇస్తుండు నాకేమి ఫికర్లేదు. నా ఖర్చులు పోను వెయ్యి మిగులుతున్నాయి. చాలు ఆయనను ఇకసారి చూసిపోదామని వచ్చాను. మళ్లీ గెలుస్తే మళ్లీ పెంచుతానని ఇప్పుడే చెపిండు..అందుకే కేసీఆర్ సార్కే నా ఓటు..
తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్ సార్‌ను చూడ డానికి వచ్చాను. ఆయనను చూశాక చాలా సంతోషం అనిపించింది. కేసీఆర్ సార్ రైతులను రాజు చేసిండు. రైతులకు రైతుబంధు సాయం అందించి వ్యవసాయ పెం చిండు. కాంగ్రెస్ కాలంలో కరెంట్, నీరు లేక తిప్పలు పడ్డాం. కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేసి పింఛన్, రైతుబంధు, తాగునీరును కాపాడుతం.
తెలంగాణ ఉద్యమం చేసి సావుతో కొట్లాడి తెలంగాణ సాధించిండు. మ హబూబ్‌నగర్ ఎంపీకి పాలమూ రు లో ఉండి గెలిచిండు. తెలంగాణ గవర్న మెంట్ మాకు తాగడానికి నీరు, రైతుబంధు, పింఛన్ ఇస్తుంది. కాంగ్రెస్ కాలంలో మాకు ఏం ఇయ్యలే. మా ఇంట్లో అందరం కారు గుర్తుకే ఓటు వేస్తాం. మీటింగ్‌లో కేసీ ఆర్ సార్ మాటలు చాలా ధైర్యామిచ్చింది.