అలంపూర్ చౌరస్తా, ఫిబవరి 1: తెల్లవారుజామున రెండు బస్సులో ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నా రు. ఒక్కసారిగా ప్రమాదం దాని వెనుకే ఇంకో ప్రమా దం సంభవించడంతో ప్ర యాణికులు భయభ్రాంతులతో గట్టిగా కేకలు వేస్తూ కన్నీరుమున్నీరయ్యా రు. పెనుప్రమాదం త ప్పడంతో రెండు బ స్సుల ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్న ఘ టన జోగుళాంబ గ ద్వాల జిల్లా ఉండవె ల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపంలో పుల్లూరు టో ల్గేట్ వద్ద శనివారం జాతీయ రహదారిపై చోటుచేసుకున్నది. ఎస్సై మహేశ్ కథనం ప్రకారం ఏపీలోని అనంతపురం జి ల్లా రామలచెర్వుకు చెందిన తిరుపాల్ (లారీడ్రైవర్) హైదరాబాద్ నుంచి లారీలో బండ లు వేసుకుని కర్నూల్ వైపు వస్తుండగా..
సరిగ్గా పుల్లూరు టోలోగేట్ స మీపంలో దూమ్ దాబా వద్ద ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండా రైట్‌టర్న్ ఇస్తుండ గా.. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న సీజీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముం దున్న లారీని ఢీకొట్టింది. బస్సు వెనకాలే వస్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ముందున్న సీజీఆర్ బస్సును ఢీ కొనడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. రెండు బస్సులు ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతో రెండు బస్సుల డైవర్లు చంద్రశేఖర్, బాబాసాహేబ్‌కు తీవ్ర గాయాలై కాళ్లు విరిగిపోయా యి. వీరిని బయటకు తీసేందుకు తోటి ప్రయాణికు లు తీవ్ర ఇబ్బందులు పడుతూ హైవే పెట్రోలింగ్ సహాయంతో గంటపాటు కష్టపడి వీరిని బయటకు తీశా రు.
రెండు బస్సుల్లో సమీర్, రోహిత్, ప్రసాద్, అజ య్, బాబు. సందీప్, ఓబుల్‌రెడ్డి, రఘురెడ్డి, జగదీశ్, సావిత్రి, శ్రీదేవి, లక్ష్మీదేవి ఇలా 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. మిగతా కొంతమంది చిన్నపాటి గా యాలు కావడంతో 108లో కర్నూల్ దవాఖానకు తరలించారు. కడప జిల్లా సీజీఆర్ ట్రావెల్స్ మేనేజర్ చెన్నంశేష్ఠి రెడ్డయ్య ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ తిరుపాల్‌పై కెసు నమోదు చేసి దర్యాప్త్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదం సంభవిచడంతో 44వ జా తీయ రహదారిపై రెండు గంటలపాడు ట్రాఫిక్ జామ్ అయ్యింది. టోల్‌గేట్‌కి రహదారికి ఇరువైపుల వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.