కొల్లాపూర్ రూరల్, జనవరి 24 : మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులపై స్థానిక మంత్రి ఫోకస్ చేసి వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి బీరం హర్షవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బలవంతంగా కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శనివారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ యన మాట్లాడుతూ బల్దియా ఎలక్షన్లలో అధికార పార్టీకి గెలు పు కష్టమని సర్వేల్లో తేలడంతో ఖంగుతిన్న మంత్రి దిక్కుతోచని స్థితిలో గులాబీ పార్టీని టార్గెట్ చేస్తున్నారన్నారు.
అభ్యర్థులను వారి పార్టీలో చేర్చుకోవడానికి ప్రత్యేక టీంను నియమించి వారి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులకు ఫోన్లు చేయించి ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. లేదా వారి బం ధువులతో ఫోన్లో మంతనాలు చేయిస్తున్నారని, మాటవినని వారు ఉంటే వ్యాపారాలపై అధికారులతో దాడులు చేయిస్త్తూ లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజత్తారు. మంత్రి ఎన్ని కుట్రలు చేసినా మా వెంట కార్యకర్తలు, ప్రజలు ఉన్నారన్నారు. అధికార పార్టీకి ఓటుతో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు పట్టణంలోని ప్రతి వార్డులో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదన్నారు. దసరాకు ఇవ్వాల్సిన బతుకమ్మ చీరలను ఇప్పుడు పేరు మార్చి ఇందిరమ్మ చీరలు పేరుతో ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మా కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.