మరికల్, జూన్ 05 : ప్లాస్టిక్‌ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని నారాయణపేట జిల్లా జడ్పీ సీఈవో శైలేష్ సూచించారు. గురువారం మరికల్ మండల కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీని నిర్వహించారు. అలాగే మండలంలోని ప్రతి గ్రామంలో పర్యావరణ పరిరక్షణ కోసం ర్యాలీలను నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్పీ సీఈవో మాట్లాడుతూ.. కిరాణం, హోటల్స్‌లో ప్లాస్టిక్ నివారిద్దామని ప్లాస్టిక్ వాడడం వల్ల అనర్థాలు ఎక్కువ ఉన్నాయని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కొండన్న, పంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, అఖిలపక్ష నాయకులు సూర్య మోహన్ రెడ్డి, రాజేష్ యాదవ్, కృష్ణయ్య, సూర్య ప్రకాష్, సురేందర్ గౌడ్, లంబడి రాములు, కాటకొండ ఆంజనేయులు, రామకృష్ణ, మహేష్ తో పాటు అంగన్వాడి కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.