వెల్దండ : నాగర్ కర్నూలు జిల్లా ఎల్దుండ మండలం పోతేపల్లి గ్రామంలో శనివారం బీఆర్ఎస్( BRS) రజతోత్సవ సభ ( Silver jubilee) పోస్టర్లను మండల నాయకుడు కొండల్ యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో జరిగే సభను అందరూ విజయవంతం చేయాలని కోరారు.
గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి విశేష స్పందన ఉందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకుడు జంగిలి ఆనంద్ , అశోక్, రవి ,శ్రీను ,వెంకటేష్ ,నారమ్మ తదితరులు పాల్గొన్నారు.