మరికల్, డిసెంబర్ 19 : సర్కార్ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తెలిపారు. ధన్వాడ మండలంలో సోమవారం ఎమ్మెల్యే సమక్షంలో ఎంపీపీ పద్మినీబాయి, బీజేపీ ఎస్టీమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పాండునాయక్, గున్ముక్ల గ్రామానికి చెందిన 30 మంది బీఎస్పీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ వెంకట్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు వాహిద్, నాయకులు చంద్రశేఖర్, సచిన్, మురళీధర్‌రెడ్డి, ఎంపీటీసీ సుదీర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.