అలంపూరు : స్థానిక అలంపూరు మాంటిస్సోరి పాఠశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన లారెల్స్ డే ( Laurels Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి నాగలక్ష్మి ( Nagalaxmi ) జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా విద్యా, క్రీడా, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బెస్ట్ స్టూడెంట్( Best Students ) , అకాడమిక్ ఎక్సలెన్స్, సబ్జెక్ట్ టాపర్స్, బెస్ట్ రీడర్స్, బెస్ట్ క్యాలిగ్రఫీ , బెస్ట్ ఇంప్రూవ్ మెంట్ అవార్డులను సైతం అందించి ప్రోత్సహించారు.
పాఠశాల కరస్పాండెంట్ కేఎన్వీ రవి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే వివిధ పోటీల్లో పాల్గొంటూ తమలోని ప్రతిభను చాటుకోవాలని సూచించారు. హెచ్ఎం నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి చిన్ననాటి నుంచే లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటిని సాధించేందుకు ముందడుగు వేయాలని అన్నారు. విద్య అనేది కేవలం పాఠ్యపుస్తకాల పరిమితి కాదని, జీవన మార్గాన్ని నిర్దేశించేదిని పేర్కొన్నారు. పాఠశాల డైరెక్టర్ కె.యన్.వి. రవి ప్రకాశ్ , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.