మక్తల్, ఫిబ్రవరి 18 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూసేకరణ కోసం చేపడుతున్న సర్వే పోలీస్ పహారా మధ్య మక్తల్ మండలంలో కొనసాగుతున్నది.
మంగళవారం సైతం మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో మంతన్‌గౌడ్, కాచ్వార్ శివారుల్లో రెవెన్యూ అధికారులు అధికారులు సర్వే చేపట్టారు. కార్యక్రమంలో తాసీల్దార్ సతీశ్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.