భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలి
జవహార్ నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకంలో భాగంగా వివిధ ప్యాకేజీల పరిధిలో సేకరించాల్సిన 534 ఎకరాల భూ సేకరణ ప్రక్రియను ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్‌నాయుడు అన్నారు.
- నెట్టెంపాడ్ భూ సేకరణ 45 రోజుల్లో పూర్తవ్వాలి
- ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, గద్వాల కలెక్టర్ రిజ్వాన్‌బాషా
గద్వాల, జూన్ 9 : జవహార్ నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకంలో భాగంగా వివిధ ప్యాకేజీల పరిధిలో సేకరించాల్సిన 534 ఎకరాల భూ సేకరణ ప్రక్రియను ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్‌నాయుడు అన్నారు. జిల్లాలోని నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పథకాలతోపాటు మల్లమ్మ కుంట రిజర్వాయర్‌కు అవసరమైన భూ సేకరణపై మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కమిషనర్‌తోపాటు జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్అండ్ఆర్ కమిషనర్ మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులపై సమీక్ష చేసేందుకు ఇటీవల పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి గద్వాల జిల్లా పెండింగ్ ప్రాజెక్టులపై మాట్లాడారన్నారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ ఆలస్యం కావడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారని, ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించి ముందుకు వెళ్లాలని ఆదేశించారని చెప్పారు. గట్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించి 462 ఎకరాలను, ఆర్డీఎస్ పరిధిలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ఫేజ్-2 కింద నిర్మిస్తున్న మల్లమ్మ కుంట రిజర్వాయర్‌కు 567ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉందన్నారు.
నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకం ప్రారంభమై చాలా ఏళ్లు కావడంతో భూ సేకరణ విషయంలో దీనికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్లాలన్నా రు. నెట్టెంపాడ్ పరిధిలో మొత్తం 534ఎకరాల్లో కోర్టు కేసులు, ఇతర సమస్యలు లేని సుమారు 220 ఎకరాలకు ఈనెల 15వ తేదీలోగా ప్రిలిమినరీ డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ పూర్తయితేనే ఎత్తిపోతల పథకాల పనులు సకాలంలో పూర్తి చేసి సంబంధిత ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు వీలుంటుం దన్నారు. జిల్లాలోని వివిధ రిజర్వాయర్లలో ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాల్లో ఆవాసం కల్పిం చినందున అక్కడ వారికి కల్పిస్తున్న కనీస మౌలిక వసతులలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయా పథకాలకు సంబంధించి వివిధ మండలాల పరిధిలో సంబంధిత గ్రామాల్లో సేకరించాల్సిన భూ సేకరణపై అధికారులతో మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆయా ఎత్తిపోతల పథకాలకు అవసరమైన భూ సేకరణ విషయంలో ఎవరైనా రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే ప్రభుత్వ అవసరాలు, ప్రాజెక్టుల ఆవశ్యకతను గురించి వారికి వివరించి ఒప్పించాలన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ లు ప్రత్యేక టీంలుగా ఏర్పడి భూసేకరణ ప్రక్రియ ను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ సీఈ రహీమొద్దీన్, సర్వేఏడీ నూకరాజు, ఎస్డీసీ కృష్ణ, ఆయా మండలాల తా సీల్దార్లు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

