గద్వాల టౌన్, ఫిబ్రవరి 20 : జిల్లా కేంద్రంలోని భూ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నా యి. వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చే సింది. అయితే తిరుమల శ్రీ వారి ఉత్సవాల సందర్భంగా ఏరువాడ పంచెలను సంస్థా నం కాలం నుంచి దాదాపు ఐదు దశాబ్దాలుగా అందిస్తూ చేనేత ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిన సంస్థానంగా నిలిచింది. అదే స్ఫూర్తితో సంస్థాన కాలం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శ్రీ భూలక్ష్మీచెన్నకేశవుడికి గద్వాల పట్టు పంచె.. అమ్మవారికి పట్టు చీరను బ్రహ్మోత్సవాల్లో సమర్పించేందుకు శ్రీకా రం చుట్టింది జరీ చీరల ఉత్పత్తి సంఘం.. నియమ నిష్టలతో మగ్గంపై నేసిన వస్ర్తాలను మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమర్పించేందుకు వేగంగా నేత పని కొనసాగుతున్నది. దీంతోపాటు చేనేత కళాకారులు వారి నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటనున్నారు.
గద్వాల సంస్థానాధీశుల కాలంలో మాఘశుద్ధ పౌర్ణమి రోజు స్వామి, అమ్మవారికి అఖండ వస్త్ర అలంకరణ నిర్వహించేవారు. ఎంతో నియమ, నిష్టలతో తయారు చేసేవారట. అదే ఆనవాయితీ కొనసాగింపుగా గద్వాల జరీ చీరల ఉత్పత్తి సం ఘం ప్రత్యేక వస్ర్తాలను రూపొందించేందుకు ముం దుకొచ్చింది. కోటలోని సీతారామాలయంలో ప్రత్యేక మగ్గాన్ని ఏర్పా టు చేసి వసంత పంచ మి రోజు నేత పనిని ప్రా రంభించారు. కోట కొ మ్ముల అంచుతో ఆరున్నర గజాల పంచె, చీర ను ఎనిమిది రోజుల పా టు.. మొత్తం తొమ్మిది వి డుతల వారీగా నేస్తున్నా రు. ఇప్పటికే పట్టు పంచె పూర్తి కాగా అమ్మవారి చీర రూపుదిద్దుకుంటున్నది. ఈ వస్ర్తాలను మాఘశుద్ధ పౌర్ణమి రోజు స్వామి, అమ్మవార్లకు అలంకరించనున్నారు.
స్వామి, అమ్మవారికి చేనేత వస్ర్తాల నేత పనిలో 9 మంది చేనేత కళాకారులు ఉన్నారు. అక్కల శాంతారం, శ్రీహరి, అక్కల సురేశ్, వెంకటేశ్, సాక రాము, కొంగరి వినయ్, రుక్మంధర్, శ్రీ రాం, అజయ్, గడ్డం రఘుతోపాటు మరికొందరు కళాకారులు నేతలో సహాయపడుతున్నారు.
తిరుమల శ్రీవారికి సమర్పించే ఏరువాడ పంచెల మాదిరి గద్వాల కోటలో వెలసిన భూలక్ష్మీ చెన్నకేశవస్వామికి మా చేనేత వస్ర్తాలను అలంకరించాలన్న సంకల్పం నెరవేరింది. ఆ రేండ్ల కిందటే స్వామికి వ స్ర్తాలు సమర్పించాలని స మిష్టిగా నిర్ణయం తీసుకు న్నాం. మాఘశుద్ధ పౌర్ణమి రోజు వైభవంగా నిర్వహించే ఉత్సవాల్లో స్వామి, అమ్మవారిని ఈ వస్ర్తాలతో అలంకరిస్తాం. మొదటి సారి మా చేతుల మీదుగా సమర్పించడం సంతోషంగా ఉన్నది.
నేను 40 ఏండ్లుగా చేనే త వృత్తిలో ఉన్నాను. ఎ న్నో చీరలు నేచాను. కానీ లక్ష్మీ చెన్నకేశవస్వామికి గ ద్వాల చేనేత పట్టు వస్ర్తాలు సమర్పించడం ఎంతో ఆ నందంగా ఉన్నది. వస్ర్తాల తయారీలో చేతనైన సేవను అందించడంతో నా జన్మధన్యమైంది.