దామరగిద్ద, జూలై 10 : మండల కేంద్రంలో జీపీఎస్ పాఠశాల నూతన భవనం కట్టినా ఆరుబయటే విద్యార్థుల చదువు కొనసాగుతోం ది. మూడు వారాల కిందట స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించినప్పటికీ విద్యార్థుల ను మాత్రం ప్రైవేట్ భవనంలో ఆరుబయట కూర్చోబెట్టి పా ఠాలు బోధిస్తున్నారు. వర్షాకాలంలో విద్యార్థులను బయట కూర్చోబెట్టి ఆరోగ్యాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషపురుగుల బారిన పడితే ఎవరు బాధ్యులవుతారని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఇన్చార్జి మండల విద్యాధికారి గోపాల్‌నాయక్‌ను ఫోన్ ద్వారా వివరణ కోర గా.. మరుగుదొడ్లు, వంటగది లేనందునా పాత బిల్డింగ్‌లో కొనసాగిస్తున్నామని చెబుతున్నారు.
మక్తల్, జూలై 10 : పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు తీసుకొచ్చిన మధ్యాహ్న భో జన పథకాన్ని కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. ఏడు నెలల నుంచి వంట బిల్లులు, గుడ్ల బిల్లులు రాక కార్మికులు, కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలకు వేలు అప్పులు తెచ్చి విద్యార్థులకు వంట చేస్తున్నామని, నెలల తరబడి పెండింగ్ పెడితే ఎలాగని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మక్తల్ మండలంలో ఎనిమిది ఉన్నత పాఠశాలలు, 13 ప్రాథమికోన్నత, 37 మండల ప్రజా పరిషత్ పాఠశాలల్లో 7,656 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉండగా, పెరిగిన ధరలతో వంట కార్మికులు, ఏజెన్సీలు అనేక తంటాలు పడుతున్నారు. దీనికి తోడు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు పెరిగి అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
01
విద్యార్థులకు వారానికి మూడు సార్లు గుడ్డు పెట్టమంటున్నరు. ఐదు నెలల నుంచి బిల్లులు ఇస్తలేరు. వంట చేయడానికి కూరగాయాలు, సరుకులు అప్పులు చేసి కొం టున్నాం. కేసీఆర్ సర్కారులో ప్రతి నెలా బిల్లులు వచ్చేవి. ఇప్పుడు పెరిగిన ధరలకు రోజు కూలీ కనీసం రూ.100 కూడా వొస్తలేదు. నెలలుగా బిల్లులు ఇయ్యకుంటే వంటలు ఎట్ల చే యాలే. పెరిగిన రేట్ల ప్రకారం బిల్లులు చెల్లించాలి.
వంట బిల్లులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మేము పస్తులున్నా సరే విద్యార్థుల కడుపులు మాడ్చొద్దని బయట అప్పులు తెచ్చి వంట చేస్తున్నాం. వడ్డీలు పెరుగుతున్నాయి. అయినా సర్కారు మా బాధ పట్టించుకుంటలేదు. వేలకు వేలు అప్పులు తెచ్చి వంట చేస్తుంటే కొన్ని నెలల నుంచి బిల్లులు ఇస్తలేరు. మా ఇంట్లో ఎలా గడుస్తదనే విషయాన్ని కాంగ్రెసోళ్లు ఆలోచించాలి. నెలనెలా బిల్లులు ఇచ్చేటట్లు సర్కారు చర్యలు తీసుకోవాలే.
సర్కారు బడుల్లో పిల్లలకు సరిపడా టీచర్లు లేకపోతే చదువులు ఎవరు చెప్పాలె. మా గ్రామంలో ఉన్న బడిలో 148 మంది పిల్లలు చదువుతున్నారు. ఒక స్కూల్ అసిస్టెంట్, ఆరుగురు ఎస్జీటీ టీచర్లు ఉండాల్సి ఉండగా.. ఒక స్కూల్ అసిస్టెంట్, ఒక ఎస్జీటీ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఐదు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని వెంటనే భర్తీ చేసి విద్యార్థుల చదువులు సక్కగా సాగేందుకు సర్కారు చర్యలు తీసుకోవాలి. మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి.
కేసీఆర్ సర్కారు హయాంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందాయి. అయితే, కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తరు వాత ఏడు నెలలుగా పాఠశాలల్లో సరైన వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరైన మెయిం టనెన్స్ లేదు. పారిశుధ్య కార్మికులు లే క మురుగుదొడ్లు, పాఠశాల గదులు అపరిశుభ్రంగా మారాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పారిశుధ్య కార్మికులను నియమించాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వా రంతా పేద విద్యార్థులే ఉంటారు. అలాంటి వారు ఇబ్బందులు పడొద్దని కేసీఆర్ సారు పొద్దుగాల బ్రేక్‌ఫాస్ట్ పెడుతుండె. కాంగ్రెసోళ్లు వచ్చినంక పిల్లల నోటికాడి కూడు లాగేసుకునేలా ఆ పథకాని కి మంగళం పాడిండ్రు. పొద్దుగాల ఇండ్లకాడ వంట కాక పిల్లలంతా పస్తులతో బడికి వస్తున్నరు. మధ్యాహ్న భోజనం కూడా సరిగా పెడ్తలేరు. మెనూ ప్రకారం భోజనం పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాంగ్రెస్ సర్కారు స్పందించి ప్రభుత్వ బడుల్లో సమస్యలను పరిష్కరించాలి.
కాంగ్రెస్ సర్కారులో ఆబ్కారీ శాఖకు మం త్రి ఉన్నాడు కానీ.. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే విద్యాశాఖకు మాత్రం మంత్రి లేడు. దీన్నిబట్టే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్ర భుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా విద్యాశాఖను పట్టించుకున్న పాపనపోలే దు. ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లిపోవడంతో విద్యార్థుల చదువు ప్రశ్నార్థకం గా మారింది. మధ్యాహ్న భోజన బిల్లులు ఇస్తలేరు. పారిశుధ్య పనులు లేవు. దుస్తులు ఒక జత మాత్రమే ఇ చ్చిండ్రు. విద్యావ్యవస్థపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళనలు చేపడుతాం.
మూడు నెలలుగా వంట బిల్లులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నాం. నెలకు రూ.60 వేల వరకు (కూరగాయలు, గుడ్లు, కంది పప్పు, ఇతర వస్తువుల కొనుగోలుకు) అవుతున్నాయి. విద్యార్థులు పస్తులుండొద్దని వడ్డీలకు అప్పులు తెచ్చి మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. ధరలు పెరగడంతో నష్టాలు వస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులతోపాటు పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు మంజూరు చేయాలి.
పెరిగిన ధరలతో మధ్యాహ్న భో జనం వండాలంటే ఇబ్బందులు ఎ దురోవాల్సి వస్తున్నది. సర్కారు నె లలుగా బిల్లులు ఇయ్యకపోవడంతో శానా ఇబ్బందులు పడుతున్నాం. కార్మికులకు నెలకు రూ.10వేల వేతనం అందించి ఆదుకోవాలి.
వంట ఏజెన్సీకి ఇబ్బందులెదురైనా విద్యార్థులకు మెనూ ప్రకారంగా భోజనం అందించేలా చర్యలు చేపడుతున్నాం. ప్రతినెలా బిల్లులు వచ్చేలా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.