మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పచ్చని నల్లమల్ల గులాబీ రంగు పులుముకున్నది.. అచ్చంపేటలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకకు సర్వం సిద్ధమవుతున్న ది.. మాజీ ఎమ్మెల్యే పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లినా.. కార్యకర్తలు బీఆర్ఎస్ జెండాను వదల్లే దు.. ఒక్కొక్క కార్యకర్త సైనికుడిలా మారి కథం తొక్కుతున్నారు. ఆదివారం అచ్చంపేట జన గర్జనకు కేటీఆర్ వస్తుండడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లమల మొత్తం గులాబీమయంగా మారిపోయింది. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గ్రామగ్రామం నుంచి కార్యకర్తలను తరలించేందు కు ఏర్పాటు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని మండలాల కార్యకర్తలు నాయకులతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు.
చెల్లా చెదురైన క్యాడర్‌ను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి మేమున్నామని భరో సా ఇచ్చారు. అచ్చంపేట జనగర్జన పేరుతో ఆదివారం నిర్వహించే కేటీఆర్ సభకు వేలాది మందిని సమీకరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. స్వా ర్థం కోసం పార్టీ మారిన గువ్వల బాలరాజు తన వెంట నేతలు, క్యాడర్ వస్తుందని భావించి బోల్తా పడ్డారు. చివరకు కార్యకర్తలంతా ఒక్కటై అచ్చంపేటలో గర్జిస్తుంటే గువ్వల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్
రెడ్డి, జైపాల్‌యాదవ్ కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీ అధికారం కోల్పోయాక తమ ఆస్తిత్వాన్ని కాపాడుకునేందుకు కొంత మంది స్వార్థపరులు పార్టీ మారినా ఆయా నియోజకవర్గాల్లో క్యాడర్ మాత్రం చెక్కు చెదరలేదు. నేతలు కార్యకర్తలు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ గులాబీ జెండా నీడనే ఉన్నారు. గద్వాల సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అధికార పార్టీలోకి చేరిపోయారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి జంప్ అయ్యారు.
ఈ రెండు నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు ఎవరు వాళ్ల వెంట వెళ్లలేదు. కార్యకర్తలకు మాజీ మంత్రు లు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి అండగా నిలిచారు. గద్వాలలో కాంగ్రెస్‌లో చేరిన బండ్లకే చెక్కుపెట్టి అదే పార్టీకి చెందిన మిగతా నేతలను గులాబీ పార్టీలోకి చేర్పించుకొని షాక్ ఇచ్చారు. ఈనెల 13న గద్వాల గర్జన పేరిట నిర్వహించిన సభకు పా ర్టీ వారికి ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. భారీ వర్షం పడుతున్నా సభ ఊహించని రీతిలో సక్సెస్ అయింది. ఈనెల 28న అచ్చంపేట జనగర్జన పేరుతో నిర్వహిస్తున్న సభకు కేటీఆర్ రానున్నారు. తాము పోతే పార్టీ ఉండదని బీరాలు పరికిన నేతలకు ఈ రెండు సభలు గుణపాఠం కానున్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లాలో క్రియాశీలకంగా ఉన్న అచ్చంపేట నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. పార్టీ అధ్యక్షుడిగా.. ప్రభుత్వ విప్‌గా పనిచేసిన గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. అయన వెంట మెయిన్ క్యాడర్ ఎవరూ వెళ్ల లేదు. దీంతో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అచ్చంపేట నియోజకవర్గ సమన్వయకర్తగా నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి అప్పజెప్పారు. దీంతో ఆయన అచ్చంపేట నియోజకవర్గ మొత్తం తిరుగుతూ పార్టీ క్యాడర్‌ను కార్యకర్తలను సమీకరించారు. మీకు అండగా నేను న్నా అంటూ మరి జనార్దన్‌రెడ్డి అచ్చంపేటలోనే మకాం వేసి అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారు. దీంతో పార్టీ మొత్తం తన వెంట వస్తుందని భా వించిన గువ్వలకు ఈ పరిణామాలు షాక్ ఇచ్చా యి. అచ్చంపేట సభకు మర్రి దగ్గరుండి కార్యకర్తలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
అచ్చంపేట జన గర్జన సభకు పోలీసుల అనుమతి రాకుండా అధికార పార్టీ నేతలతో పాటు బీజేపీ నే తలు కూడా అడ్డు పుల్లలు వేశారు. అయినా పార్టీ సమన్వయకర్త మర్రి జనార్దన్‌రెడ్డి మెజారిటీ కార్యకర్తలు అనుకున్న చోటనే సభ నిర్వహించేందుకు అనుమతిని తీసుకువచ్చారు. అచ్చంపేట నడిబొడ్డున సభ నిర్వహించాలని మెజారిటీ కార్యకర్తలు సూచించారు. అయితే ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతు ందని స్థానిక పోలీసులతో చెప్పించి దూరంగా తరలించాలని చూశారు. కానీ జిల్లా పోలీసు యంత్రా ంగాన్ని కలిసి అనుమతి సాధించడంలో మర్రి జనార్దన్‌రెడ్డి సక్సెస్ అయ్యారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు వేసిన పాచికలు పారలేదు.
ఉమ్మడి జిల్లాలో కేటీఆర్ పర్యటన సందర్భంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 13న గద్వాలలో కూడా ఇదే రకమైన పరిస్థితి తలెత్తింది. ఒకవైపు వర్షాలు మరోవైపు కేటీఆర్ రాకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన కొంతమంది వర్షం కారణంగా సభ రద్దవుతుందని ప్రచారం మొదలు పెట్టారు. అయినా కార్యకర్తలు వర్షం వచ్చినా పిడుగులు పడ్డ రావాల్సిందేనని పట్టుబట్టడంతో వర్షంలోనే కేటీఆర్ పర్యటన సాగనుంది. కనీవిని ఎరుగని రీతిలో గద్వాల సభ విజయవంతమైంది. ఇప్పుడు కూడా అచ్చంపేటలో జనగర్జన సభకు ముహూర్తం ఫిక్స్ చేసిన తర్వాత వర్షాలు మొదలయ్యాయి. ఈ రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. అయితే అచ్చంపేటలో కూడా వర్షం పడ్డ సభ కొనసాగా ల్సిందేనని కార్యకర్తలు పట్టుబట్టడంతో షెడ్యూల్డ్ ప్రకారమే కేటీఆర్ పర్యటన సాగుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పార్టీ సమన్వయకర్త మర్రి జనార్దన్‌రెడ్డి ప్రకటించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. మధ్యాహ్నం మూడు గంటలకు అచ్చంపేటకు చేరుకుంటారు. కేటీఆర్‌ను పట్టణ శివారులో స్వాగతం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి కార్యకర్తలతో ర్యాలీగా సభాస్థలికి చేరుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభమ వుతుంది. ఈ మేరకు స్థానిక నాయకులు వేదిక.. కార్యకర్తలు కూర్చునేందుకు సరిపడా స్థలాన్ని చదును చేస్తున్నారు.