కోయిలకొండ: ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సహయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమ లవుతున్నాయని వెల్లడించారు.
నల్లవెల్లికి చెందిన అంజిలప్పకు రూ.20వేలు, ఖాజీపూర్‌కు చెందిన ఎరుకలి అనుతష్కు రూ.32వేలు, కనాయపల్లికి చెం దిన అనీల్‌కుమార్‌కు రూ లక్షా 30వేలు, లింగుపల్లికి చెంది న మంజులకు 16వేలు, భాస్కర్‌కు రూ.28వేలు, వీరన్నప ల్లికి చెందిన బాలకిష్ట్రయ్యకు రూ.60వేలు, అయ్యవారిపల్లికి చెందిన కమలమ్మకు రూ.24వేల 600,
అంకిళ్లకు చెందిన రాములుగౌడ్‌కు రూ.60వేలు, రాములమ్మ రూ.8వేల 500, బూర్గుపల్లికి చెందిన యశ్వంత్‌రెడ్డికి రూ.28వేలు, వింజామూర్కు చెందిన నీల మ్మకు రూ.14వేలు చెక్కులను అందిం చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయభాస్కర్ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బీ.కృష్ణయ్య నాయకులు భీంరెడ్డి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.