మక్తల్, మే 15 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రా జెక్టు కోసం మక్తల్, నారాయణపేట ప్రజలకు అన్యాయం చేస్తామంటే సహించేది లేదని సీఎం రేవంత్‌రెడ్డిని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం మక్తల్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిట్టెం మాట్లాడారు. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్ నియోజకవర్గానికి నీటిని ఏ విధంగా తీసుకెళ్తారో రేవంత్‌రెడ్డి బహిరంగంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అర్థమయ్యేలా వివరించాలన్నారు. భూత్పూర్ రిజర్వాయర్ 1.3 టీఎంసీల సామర్థ్యం ఉండగా, 90కిలోమీటర్ల పైపులైన్ ద్వారా కొడంగల్‌కు ఒక టీఎంసీ నీటిని ఏ విధంగా తీసుకెళ్తారో చెప్పాలన్నారు.
డీ పీవో రిపోర్టు, ఫారెస్ట్ క్లియరెన్స్, భూ సేకరణ, కృష్ణ బోర్డు నుంచి అనుమతులు లేకుండా ప్రాజెక్టు ఏ విధంగా చేపడుతారని ప్రశ్నించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ టెండర్లు దకించుకున్న విషయం రాష్ట్రమంతా తెలుసని, ప్రాజెక్టు పనులు ప్రారంభం కాకముందే పైపుల నిర్మాణం చేపట్టామంటూ రూ.100కోట్ల బిల్లు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. భూసేకరణ కోసం అధికారులు పోలీస్ బలగాలను తీసుకెళ్లి రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డా రు.
రైతులకు మారెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లిస్తే తప్పా ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించబోమని హెచ్చరించారు. నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు వల్ల మక్తల్ ని యోజకవర్గంలోని నర్వ, అమరచింత, ఆత్మకూరు మండలాలకు సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని, భూ త్పూర్ రిజర్వాయర్‌లో చుక నీరు లేకుండా కొడంగల్ నియోజకవర్గానికి నీటిని ఎలా తరలిస్తారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.
చిన్న గోప్లాపూర్ పంప్‌హౌస్ వద్ద నీటిని ఎత్తిపోసేందుకు మూడు మోటర్లను అమర్చడం జరిగిందని, దివంగత చిట్టెం నర్సిరెడ్డి ముందుచూపుతో స్టేజ్-1 పంప్‌హౌస్‌లో స్టాండ్ బై పంప్ అమర్చి భవిష్యత్‌లో మోటర్ల రిపేరుకు ఇబ్బంది లేకుండా నీటిని పంపించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. రిజర్వాయర్లపై ఎలాంటి అవగాహన లే ని సీఎం, ఎమ్మెల్యేలు నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపడుతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కొడంగల్‌కు నీటిని తీసుకెళ్లే ముందు మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలకు ఏవిధంగా సాగునీళ్లు ఇస్తారో ప్రజలకు చెప్పాలన్నారు.
కొడంగల్ నియోజకవర్గానికి సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలనుకుంటే పకనే ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలే తప్పా మక్తల్ నియోజకవర్గం నుంచి నీటిని ఎలా తీసుకెళ్లే ప్ర యత్నం చేస్తారని మండిపడ్డారు. నారాయణపేట, మక్తల్‌కు అన్యాయం చేయాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్‌గుప్తా, మాజీ జెడ్పీటీసీలు అరవింద్, అశోక్‌గౌడ్, నర్వ మండలాధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, మారెట్ క మిటీ మాజీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు చిన్న హ న్మంతు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు రాములు, మొగుల ప్ప, నాయకులు అన్వర్ హుస్సేన్, గాల్‌రెడ్డి, శంకర్, నర్సింహారెడ్డి, కృష్ణ, మన్నన్, సాగర్, శివారెడ్డి, అశోక్‌గౌడ్, బా లప్ప తదితరులు పాల్గొన్నారు.