బైక్‌ను ఢీకొట్టిన కర్ణాటక బస్సు
కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఓ బైక్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి వివరాల ప్రకారం మక్తల్ పట్టణంలోని ఎల్లమ్మకుం ట, బ్రాహ్మణవాడికి చెందిన రాఘవేంద్రాచారి(30), వెంకటేశ్ (29)లు ఫొటో, వీ డియో గ్రాఫర్లుగా పనిచేస్తున్నారు.
- ముగ్గురు యువకులు మృతి
- కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు
- బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
మక్తల్ టౌన్, మే 28 : కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఓ బైక్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి వివరాల ప్రకారం మక్తల్ పట్టణంలోని ఎల్లమ్మకుం ట, బ్రాహ్మణవాడికి చెందిన రాఘవేంద్రాచారి(30), వెంకటేశ్ (29)లు ఫొటో, వీ డియో గ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. వీరు పంచలింగాలకు చెందిన విద్యార్థి మహేశ్ (18)ను వెంటబెట్టుకొ ని ఫొటోగ్రఫీ నిమిత్తం మంగళవారం మండలంలోని కాచ్వార్ గ్రామానికి బైక్‌పై వెళ్తున్న క్రమంలో కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు మక్తల్ స్వాగత బోర్డు వద్ద వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాఘవేంద్రాచారి, వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందగా మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే మహేశ్‌ను జిల్లా దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాలను మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న యువకుల కు టుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. దవాఖాన ప్రాం గణం అంతా వారి ఆర్థనాదాలతో మార్మోగింది. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్ర భాకర్ చెల్లవాడిపై కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఎమ్మెల్యే పరామర్శ
ప్రమాద విషయం తెలుసుకున్న మక్తల్ ఎమ్మెల్యే వా కిటి శ్రీ హరి మక్తల్ ప్రభుత్వ దవాఖానకు చేరుకొని మృతుల కుటుంబాల ను పరామర్శించారు. మృతుల కుటుంబాలను ప్రభు త్వపరంగా ఆదుకుంటామని ధై ర్యం గా ఉండాలని భరోసా ఇచ్చారు.
బైక్‌పై వెళ్లేవారు హెల్మెట్ ధరించాలి : చిట్టెం
బైక్‌పై వెళ్లే ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సూచించారు. మంగవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలను ఆయన పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వాహనదారులంతా రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని సూచించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

