రమణీయం.. రథోత్సవం
కందూరు రామలింగేశ్వరస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. రథంపై ఆది దంపతులను ప్ర త్యేకంగా అలంకరించి ఊరేగించారు. ఈ సందర్భంగా ఓం నమః శివాయ అంటూ పంచాక్షరీ మంత్రంతో కందూరు రామలింగేశ్వరస్వామి క్షే త్రం మార్మోగింది. ఆదివారం మధ్యరాత్రి కాముడి దహనం అనంతరం స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- రథంపై ఊరేగిన ఆది దంపతులు
- తేరులాగేందుకు భక్తుల పోటీ
- పంచాక్షరీ మంత్రంతో మార్మోగిన కందూరు క్షేత్రం
మూసాపేట(అడ్డాకుల), మార్చి 25 : కందూరు రామలింగేశ్వరస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. రథంపై ఆది దంపతులను ప్ర త్యేకంగా అలంకరించి ఊరేగించారు. ఈ సందర్భంగా ఓం నమః శివాయ అంటూ పంచాక్షరీ మంత్రంతో కందూరు రామలింగేశ్వరస్వామి క్షే త్రం మార్మోగింది. ఆదివారం మధ్యరాత్రి కాముడి దహనం అనంతరం స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా నిత్యోపాస న, రుద్రహోమం, బలిహరణ పూజా కార్యక్రమా లు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజాము న సాత్విక బలిగా గుమ్మడి, కొబ్బరి కాయలను స మర్పించారు. గొలుసులు, తాళ్లను పట్టుకొని ఓం నమఃశివాయ అంటూ వేలాది మంది భక్తులు పో టీ పడి రథాన్ని ముందుకులాగారు. రథాన్ని ఆ లయం నుంచి జాతర ప్రాంగణం వరకు లాగి తిరి గి యథాస్థానానికి తీసుకెళ్లారు. రథోత్సవంలో చి న్నా పెద్దా తేడా లేకుండా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం రథాంగ హోమం, బలిహరణతోపాటు ప్రత్యేక శాంతి పూజా కార్యక్రమా లు చేపట్టారు. రథోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన పలు ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భూత్పూర్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో అ డ్డాకుల, మూసాపేట, భూత్పూర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు. ప్రత్యేక పూజలు ముగిసిన అనంతరం భక్తులకు స్వామివా రి నిజరూప దర్శనానికి అవకాశం కల్పించారు. కా ర్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బందితోపాటు భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా తెప్పోత్సవం
రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పు రస్కరించుకొని సోమవారం స్వామి వారిని భాజాభజంత్రీలు, తప్పెట్ల మోతల మధ్య ఘ నంగా ఊరేగించారు. అనంతరం పుష్కరిణిలో స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించి పల్లకీసే వ చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

