ఆర్థిక స్వాలంబనకీ ‘కల్యాణలక్ష్మి’
రాష్ట్రంలో ఆడపిల్లల కుటుంబానికి ఆర్థిక స్వాలంబన అందించడం కోసమే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
- 70 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేత
మక్తల్ టౌన్, జనవరి 6 : రాష్ట్రంలో ఆడపిల్లల కుటుంబానికి ఆర్థిక స్వాలంబన అందించడం కోసమే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎ మ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఆడపిల్లల పెండ్లి తల్లిదండ్రులకు బరువు కాకూడదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి రూ.లక్షా116ల ను అందజేస్తూ కుటుంబానికి అండగా నిలిచాడని తెలిపారు.
ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అం దజేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబం ప్రభుత్వం నుంచి ల బ్ధిపొందుతుందన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా సీఎం కేసీఆర్ పాలనా కొనసాగిస్తూ దేశానికే తలమాణిక్యంగా రాష్ట్రం మారిందన్నారు. పైండ్లెన ప్రతి ఆడపడచుకు ప్రభుత్వం నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం నుంచి ఆర్థికసాయం అందుతుందన్నారు. పథకం నుంచి మంజూరైన 70 చెక్కులను లబ్ధ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు.
అనంతరం చెక్కు అందుకున్న కాచ్వార్ గ్రామానికి చెం దిన పల్లవి విష్ణువర్ధన్‌రెడ్డి దంపతులు ఎమ్మెల్యే చిట్టెంను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ వనజ, తాసిల్దార్ తిరుపతయ్య, మున్సిపల్ చైర్పర్సన్ పావని, బీ ఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు, నా యకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో అందరికీ సమాన హక్కులు
మక్తల్ అర్బన్, జనవరి 6 : తెలంగాణ ప్రభుత్వంలో సీ ఎం కేసీఆర్ అందరికీ సమాన హక్కులు కల్పిస్తున్నారని ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎ మ్మెల్యే నివాసంలో పట్టణ ఉర్దూ భవన్ నూతన అధ్యక్షుడి గా ఎన్నికైన ఎండి.జంషీర్ అలీని శాలువాతో శుక్రవారం ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మత ప్రాతిపదిక అన్ని మతాలు, అ న్ని కులాలకు ప్రత్యేక హామీలు ఇస్తూ నెరవేరుస్తున్నారని, అందులో భాగంగా ఉర్దూ భవన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి.నర్సింహాగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

