తిమ్మాజీపేట : భూభారతి చట్టం ( Bhu Bharati Act ) ద్వారా నిజమైన రైతుకు న్యాయం జరుగుతుందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ విజయేంద్ర బోయి (Collector Vijayendra Boi ) అన్నారు. సోమవారం తిమ్మాజిపేట మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. భూభారతి చట్టం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
నాలా మార్పు చట్టం ద్వారా చేసుకోవచ్చని, ఇంటి స్థలాలు కూడా పాస్ పుస్తకాలు ఇస్తామని వివరించారు. చట్టంపై గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించి , గ్రామాల్లో భూమికి సంబంధించిన సమస్యలు ఉంటే నేరుగా పరిష్కారం లభిస్తుందన్నారు. వచ్చే నెల నుంచి గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ అమరేందర్ , ఆర్డీవో సురేష్, మండల ప్రత్యేక అధికారి రమేష్, తహసీల్దార్ రామకృష్ణయ్య, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఏవో కమల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.