గద్వాల/అయిజ, ఆగస్టు 3 : కృష్ణాబేసిన్‌లో ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. శనివారం జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,98,000 ఇన్‌ఫ్లో రాగా 37 గేట్లు ఎత్తి దిగువ కు 2,53,230 క్యూసెక్కులు విడుదల చేస్తున్నా రు. జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉ త్పత్తి ముమ్మరంగా కొనసాగుతున్నది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.040 మీటర్లుగా ఉన్నది. గరిష్ఠ నీటి నిల్వ 9.657 టీఎంసీలకు గానూ ప్రస్తుత నీటి నిల్వ 8.690 టీఎంసీలుగా నమోదైంది. కాగా జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తికి 21,365, నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 750, జూరాల ఎడమ కాల్వకు 820, కుడికాల్వకు 731, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు నీటి ని విడుదల చేస్తున్నారు.
అదేవిధంగా కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు శనివారం ఇన్‌ఫ్లో 1,32,358 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 1,21,508 క్యూసెక్కులు ఉన్నది. 105.788 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 98.258 టీఎంసీల నీటి ని ల్వ ఉన్నది. 1633 అడుగుల నీటి మట్టానికి గా నూ ప్రస్తుతం 1631.10 అడుగులు ఉన్నది. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు 1,43,700 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 1,43,120 క్యూసెక్కుల వరద నీరు సుంకేసుల బ్యారేజీకి చేరుతోంది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 580 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 3,13,861 క్యూసెక్కులు చేరుతుండగా, అవు ట్ ఫ్లో 2,75,000 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్టు గరిష్ఠస్థాయి నీటి మట్టం 1705 అడుగులకు గానూ 1690.37 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి గరిష్ఠ నీటిమట్టం 129.72 టీఎంసీలకు గానూ, ప్రస్తుతం 70.578 ఉన్నది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2,75,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 2,34,732 క్యూసెక్కులు ఉన్నది. గరిష్ఠస్థాయి నీటిమట్టం 1615 అడుగులకు గానూ ప్రస్తుతం 1605.85 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 37.64 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 24.900 టీఎంసీలు ఉన్నది.
పెబ్బేరు, ఆగస్టు 3 : కృష్ణానదిలో వరద నీరు ఉరకలేస్తోంది. ప్రవాహం బాగా పెరగడంతో పెబ్బేరు మండలం రంగాపురం వద్ద ఉన్న పు ష్కరఘాట్లను నీరు ముంచెత్తుతోంది. పెద్ద ఎ త్తున నదిలో నీళ్లు జలసవ్వడి చేస్తూ శ్రీశైలం వై పు పరుగులు పెడుతున్నాయి.