గద్వాల, మే 31 : జూరాలకు వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు గేట్లను మూసివేశారు. శనివారం 25,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగగా, అవుట్ ఫ్లో 28,602గా నమోదైంది. విద్యుత్ ఉత్పత్తికి 26,817, నెట్టెంపాడ్ కాల్వకు 1,500, జూ రాల కుడికాల్వకు 240క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 9.657కాగా, ప్రస్తుతం 8.357 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
అయిజ, మే 31 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. శనివారం ఇన్‌ఫ్లో 20,100 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 197 క్యూసెక్కులుగా నమోదైంది. గరిష్ఠ నీటిమట్టం1,633 అడుగులకు గానూ ప్రస్తుతం 1,594.46 అడుగుల నీటిమట్టం ఉండగా, 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 15.61 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. అలాగే కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద చేరుతోంది. ఇన్‌ఫ్లో 4,329 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 4,329 క్యూసెక్కులు దిగువన ఉన్న సుంకేసుల బరాజ్‌కు చేరుతోంది. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 8.6 అడుగుల మేర నీటిమట్టం ఉన్నది.