అచ్చంపేట, సెప్టెంబర్ 30 : నల్లమల అటవీ అందాలు.. పచ్చని ప్రకృతి సోయగాల మధ్య సాగే జంగల్ సఫారీని ఆస్వాధించాలనుకునే వారికి గుడ్ న్యూస్.. నల్లమలలో జంగిల్ సఫారీ సేవలు బుధవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ప్రతిఏటా జూలై 1నుంచి సెప్టెంబర్ 30 వరకు మూడు నెలలపాటు వన్యప్రాణుల సంతానోత్పత్తికి అనుకూల సమయంగా భావించి అటవీశాఖ జంగిల్ సఫారీ సేవలు నిలిపివేసింది. ఈ మూడు నెలలపాటు అటవీలోకి పర్యాటకులు, ఇతరులు వెళ్లకుండా నిషేధం విధించారు. జంగల్ సఫారీ నిషే ధం మూడు నెలల కాలం ముగియడంతో సఫారీ సేవలు అక్టోబర్ 1 నుంచి అటవీశాఖ అధికారులు ప్రారంభించేందుకు వాహనాలు సిద్ధం చేశారు.
ఫరాహబాద్ వద్ద సఫారీ వాహనాలు సిద్ధం
శ్రీశైలం వెళ్లే మార్గంలోని నల్లమల అటవీప్రాంతం ఇప్పు డు సందర్శకులను ఆత్మీయంగా ఆహ్వానిస్తోంది. శ్రీశైలం వెళ్లేదారిలో ఫరహాబాద్ చౌరస్తా వద్ద సఫారీ వాహనాలు సిద్ధంగా ఉంటాయి. ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో వాహనా లు బుకింగ్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు సఫారీ సేవ లు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో సఫారీ టూర్ బుక్ చేసుకున్న వారికి రూ. 4500 నుంచి రూ. 8వేల వరకు రెండు ప్యాకెజీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఒక సఫారీ వాహనంలో ఏడుగురు మా త్రమే ప్రయాణం చేయాల్సి ఉం టుంది. సఫారీ సేవలు బుకింగ్‌ను బట్టి సేవలు అందిస్తారు. పర్యాటకులు రాత్రి బస చేసేందుకు వనమాలికలో ఏసీ, నాన్ ఏసీ గదులు సైతం అందుబాటులో ఉంటా యి. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు మొదటి రోజు మధ్యా హ్నం 12 గంటల వరకు మన్ననూర్ వనమాలికకు చేరుకోవాలి. అక్కడ కాటేజీలను కేటాయిస్తారు. మరుసటిరోజు ఉదయం బయోటెక్ల్యాబ్, ప్లాస్టిక్ రిసైక్లింగ్ చేసే విధానం, వన్యప్రాణుల విడిభాగాల ప్రదర్శన, పర్యాటక కేంద్రం చూపిస్తారు.
అక్కడి నుంచి సఫారీ వాహనంలో అటవీమార్గం గుండా ఫరహాబాద్ చౌరస్తా నుంచి దట్టమైన వ్యూ పాయింట్ గుండా అడవిలోకి తీసుకెళ్తారు. వన్యప్రాణులు తిరిగే ప్రాంతంలో సఫారీ వా హనం నుంచి అడవిని వీక్షిస్తూ ముందుకు తీసుకెళ్తారు. ఇక్కడ ప్రతి విషయాన్ని వాహనంలో ఉండే గైడ్ సందర్శకులకు వివరిస్తారు. ఫరహాబాద్, గుండం, దోమలపెంట (అక్కమహదేవిగుహాలు)చూపిస్తారు.
సఫారీతోపాటు ఉమామహేశ్వ రం, ప్రతాపరుద్రుడి కోటపైకి ట్రెక్కింగ్ మార్గాలు కూడా సందర్శకులకు అందుబాటులో ఉన్నాయని వీటి ద్వారా సహజ సౌందర్యాన్ని, అటవీ ప్రాంతాన్ని ఆస్వాధించవచ్చని, ప్రకృతి ఒడిలో పర్యాటకులకు సాదరంగా ఆస్వానిస్తున్నామని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ సునీల్హెరామత్ తెలిపారు. నల్లమలలో సఫారీ ప్రయాణం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. శ్రీశైలం వెళ్లేవారు ఎవరైనా ఈ సఫారీని ఎంజాయ్ చేయకుండా వెళ్లలేరు. సందర్శకులకు కొత్త అనుభూతిని అందిస్తోంది.
అడవి ప్రాంతంలో వృక్షాలు, వన్యప్రాణులు, దట్టమైన అటవీ ప్రాంతం ఆకట్టుకుంటుంది. జంతువుల జాడ తెలుసుకునేందుకు అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరాలు, జంతువుల కోసం తాగునీటి ఏర్పాట్లు ఈ జంగిల్ సఫారీలో పర్యాటకులు చూసే అవకాశం ఉంటుంది. సందర్శకులు జంగిల్ సఫారీలో పర్యాటకం అవగాహనతోపాటు విజ్ఞానం పెంచుతోంది. కొన్నిసార్లు వెళ్లే మార్గంలో పులి, దుప్పి, జిం కలు, నెమళ్లు, అడవిపంది, రేసుకుక్కలు, ఇతర వన్యప్రాణులు కనిపిస్తాయి.
రైడ్ మధ్యలో ఒక్కోసారి పులుల పాదముద్రలు, చెట్లపై వేసిన పం జాగుర్తులు, అడుగుజాడలు కనిపిస్తాయి. ఈమధ్య కాలంలో పులిని నేరుగా చూసిన వారు చాలా మంది ఉన్నారు. మరి ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతం అనేక రకాల వృక్షాలు, జంతుజాతులకు నిలయం కావడంతో సఫారీ ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని పొందవచ్చు.