గద్వాల అర్బన్, డిసెంబర్ 15 : వ్యక్తి జేబులోని సెల్‌ఫోన్ పేలిన ఘటన శుక్రవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లోని కూరగాయల మార్కెట్లో బీసీ కాలనీకి చెందిన జయరాముడు జేబులో ఉన్న జియో సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. సెల్‌ఫోన్ కింద ప్యాంట్ జేబు లో పెట్టుకోవడంతో పేలిన వెంటనే ప్యాంట్‌కు రంధ్రం పడి ఫోన్ కింద పడిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో జయరాము డికి ఎలాం టి గాయాలు కాలేదు. ఈ ఘటనతో మార్కెట్లో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.