బిజినేపల్లి, ఏప్రిల్ 1: వట్టెం గ్రామంలోని జవహార్ నవోదయలో 6,9వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు విద్యాలయం ప్రిన్సిపాల్ భాస్కర్కుమా ర్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఉమ్మ డి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై ఎంపికైన విద్యార్థుల ఫలితాలు న వోదయ వెబ్సైట్లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు. 6వ తరగతికి సంబంధించిన 80మంది, 9వ తరగతి కి సంబంధించి 9మంది ఫలితాలను వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్లకు వాట్సాప్, పోస్టు ద్వారా సమాచారం అందించడంతోపాటు సంబంధిత ఫారాలను పంపి స్తామని తెలిపారు.