మరికల్ : మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామంలో శ్రీ ఈశ్వర ఆంజనేయ స్వామి ( Anjaneya Swamy ) బ్రహ్మోత్సవాలు ( Brahmotsavams ) ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం జల్ది విందు సేవను నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకము, జలాభిషేకం నిత్య పూజలను నిర్వహించారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్( Erra Shekar ) పూజలో పాల్గొని , ఆలయ అభివృద్ధికి రూ. 25 వేలను అందజేశారు.
నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ఆలయ అభివృద్ధికి రూ.లక్షను నారాయణపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు సూర్య మోహన్ రెడ్డి ద్వారా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. మరికల్ ఎస్సై రాము, తదితరులు ఆలయంలో పూజలు చేశారు. రెండు రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.