మక్తల్, ఫిబ్రవరి 25 : కృష్ణానదికి ఎగువ ప్రాం తం నుంచి స్వల్పంగా వరద కొనసాగుతున్నది. నదీతీర ప్రాంతంలో వరిపంట సాగు చేసిన రైతన్నల సా గునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి జూపల్లి కృష్ణారావు, మక్తల్, గద్వాల, దేవరకద్ర ఎమ్మెల్యేలు 15 రోజుల కిందట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి తెలంగాణలో నదీతీర ప్రాంతాల్లో వేసిన పంటలను కాపాడుకునేందుకు కృష్ణానదికి నీటిని విడుదల చేయాలని కోరా రు.
కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం విన్న పం మేరకు నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసింది. మంగళవారం ఉదయం నాటికి జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరదతో 2800 క్యూసెకులు జూరాల ప్రాజెక్టుకు చేరిందని భీమా ప్రాజెక్టు డీఈ వెంకటరమణ తెలిపారు. కర్ణాటక ప్రాంతం నుంచి దిగువకు నీరు విడుదల చేయడం వల్ల నదీతీర ప్రాంతంలోని వేల ఎకరాల్లో వరి పంటకు సాగునీరు పుషలంగా అందుతుందని ఆయన పేరొన్నారు.
కృష్ణానదికి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నేపథ్యంలో మక్తల్ మండలం చిన్నగోపులాపూర్లోని భీమాఫేజ్-1లో అంతర్భాగమైన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, భూత్పూర్ రిజర్వాయర్లకు నీటిని తరలించేందుకు మండలంలోని చిన్నగోపులాపూర్ స్టేజ్-1 నుంచి 650 క్యూసెకుల నీటిని పంపింగ్ చేసేందుకు ఒక మోటర్‌ను అధికారులు ప్రారంభించారు.
650 క్యూసెకుల నీటిలో 250 క్యూసెక్కుల నీరు రిజర్వాయరుకు, 400 క్యూసెకుల నీరు మక్తల్ తిరుమలాయ చెరువు కట్ట వద్ద ఉన్న స్టేజ్-2 పంప్‌హౌస్ నుంచి చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్కి నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులతో పాటు మాజీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.