నాగర్‌కర్నూల్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం మహిళా పక్షపాతిగా పథకాలు అమలుచేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆ ధ్వర్యంలో కడుపులో శిశువు నుంచి వృద్ధాప్యం వరకు మహిళలకు వివిధ పథకాలను వర్తింపజేస్తున్నది. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, బాలింత, నవజాత శిశివుకు ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్లను అందజేస్తున్నది. గర్భిణులు, పుట్టిన శిశువులకు అంగన్వాడీల్లో పాలు, గుడ్లు, భోజనంతో కూడిన పౌష్టికాహారం సరఫరా చేస్తున్నది. రక్తహీనతను నివారించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నది.
బాలికలకు గురుకులాలు, పాఠశాలల్లో ఉచిత విద్యాబోధన చేపడుతున్నది. దవాఖానల్లో ఉచితంగా పరీక్షలు, మందులు, టీకాలు, సాధారణ కాన్పులు నిర్వహిస్తున్నది. గర్భం దాల్చిన మూడు నెలల నుంచి కాన్పు అయ్యే వరకు అమ్మఒ డి పథకం ద్వారా అంబులెన్స్‌లో ఇంటికి, దవాఖానకు తీసుకెళ్తున్నా రు. తెలంగాణ మహిళల ఆత్మగౌరవ ప్రతీక అయిన ‘బతుకమ్మ’కు రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇచ్చింది. క్రిస్మస్, రంజాన్ పండుగల సందర్భంగా పేద మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేస్తున్న ది.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 ఆర్థిక సాయం, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ఆ సరా పింఛన్లను అందజేస్తున్నది. మహిళలకు గృహహింస, ఇతర వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నది. 100, 181 నెంబర్లకు ఫోన్ చేసిన క్షణాల్లోనే పోలీసుల ద్వా రా సాయం అందుతున్నది. షీ టీం, సఖి కేంద్రాలను ఏర్పాటు చే యడంతో బాధిత మహిళలకు కౌన్సెలింగ్, చట్ట, న్యాయపర సహాయాలు ఇస్తున్నారు. మహిళలు, బాలికల రక్షణకు ఉన్న చట్టాల గు రించి విద్యాసంస్థల్లో పోలీసులు అవగాహన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
బాల్యవివాహాలను అరికట్టడం, వేధించిన వారిపై పోక్సో కేసులు నమోదు చేస్తూ ఆకతాయిలపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తున్నది. మహిళా సంఘాల ద్వారా రుణాలను అందిస్తూ సొంతంగా వ్యాపారాలు చేసుకులా చేయూతనందిస్తున్నది. కాగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యలో కోడ్ అమలవుతున్నది. దీంతో ఈ సారి అధికారులు వేడుకలను నిర్వహించనున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం, వడ్డీలేని రుణాలు ఎన్నికల కోడ్ తర్వాత అమలు చేయనున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకంతో మహిళలకు మధుమేహం, రక్తహీనత, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్లు, స్క్రీనింగ్, థైరాయిడ్ పరీక్షలు, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం, అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్‌లోపంతో పాటు విటమిన్ బీ12, డీ పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించనున్నారు. త్వరలో 7 నుంచి 12 ఏండ్ల బాలికలకు ఉచితంగా హెల్త్ అండ్ జెనిక్ కిట్లను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది.
ఏటా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను ప్రభుత్వం సత్కరిస్తున్నది. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంతో వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్థాయి వరకు మహిళలు రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారు. కాగా, బల్దియాల్లో 8 నుంచి 14వ తేదీ వరకు మహిళా దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు నిర్వహించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో మహిళల కోసం ఆయా తేదీల్లో వీలును బట్టి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు.
మహిళా దినోత్సవ షెడ్యూల్..
8వ తేదీ : సమావేశ మందిరాల్లో వేడుకలు, మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలైన జడ్జిలు, పోలీసులు వంటి ఉన్నత స్థాయి అధికారులు, వార్డు సభ్యుల నుంచి మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, పారిశ్రామిక వేత్తలు, సఫాయి మిత్రలను సన్మానించడం.
9వ తేదీ : మహిళా కౌన్సిలర్లు, సర్పంచులు, పారిశుధ్య సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, పంచాయతీ, పురపాలికల సిబ్బందికి ఆటల పోటీలు.
10వ తేదీ : వంటల పోటీలు.
11వ తేదీ : కంటి వెలుగు పరీక్షలు, ఫోన్ పే ద్వారా చెల్లింపులపై అవగాహన, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం.
12వ తేదీ : మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు, ఆర్పీలకు ముగ్గుల పోటీలు.
13వ తేదీ : మహిళలకు జరిగే అన్యాయాలపై చర్చలు, మహిళా శక్తి, హక్కులు, చట్టాలు, బాల్య వివాహాలపై అవగాహన.
14వ తేదీ : ముగింపు సందర్భంగా ఊరేగింపులు, ఎన్జీవోల ద్వారా మహిళా సంఘటితంపై అవగాహన, పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానం, మధ్యాహ్న భోజనాలు.
మహిళలకు శుభాకాంక్షలు
– మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, మార్చి 7 : మహిళలకు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. మహిళల అభివృద్ధికి అవసరమైన చ ర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యంతోపాటు అన్ని రకాల వసతులు, సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కవచంలా ఉంటుందని పేర్కొన్నారు.
మహిళా సంక్షేమానికి పెద్దపీట ..
సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. బాలికలు, యువతులు, వివాహితులు, వృద్ధులుగా మారిన మహిళలకు దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలుచేస్తున్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడంతో వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్ వరకు రాజకీయంగానూ ఎదిగే అవకాశం ఉన్నది. మహిళలంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
– శాంతికుమారి, జెడ్పీ చైర్పర్సన్, నాగర్‌కర్నూల్
సమాజానికనుగుణంగా మారాలి..
మహిళలు వంటింటికే పరిమితం కాదని గుర్తించాలి. ఆధునిక సమాజానికి అనుగుణంగా మారినప్పుడే మహిళాభివృద్ధి సాధ్యం. మహిళలు ఆర్థికంగా, స్వతంత్రంగా నిలదొక్కుకోవాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు సాధించొచ్చు. మహిళల్లో పోటీతత్వం పెరుగుతున్నది. విద్యార్థినులను ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యత తల్లులదే. ఉన్నత స్థానాలకు చేరుకున్న వారిని ఆదర్శంగా తీసుకోవాలి.
– స్వర్ణసుధాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్, మహబూబ్‌నగర్