‘తండ్రి నర్సింహాచార్య కళను కనుమరుగు కానివ్వకుండా చూస్తున్నా. పదిహేనవ ఏట నుంచే శిక్షణ తీసుకొని సాధన చేస్తూ నేడు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాను. ఆడపిల్ల అంటే ఆమడదూరం పెట్టే ప్రస్తుత సమాజంలో హరికథ ప్రదర్శనలివ్వడం కత్తిమీద సాములాంటిది. నాకు ఎదురయ్యే ఆటంకాలను ఎదుర్కొంటూ సొంత నైపు ణ్యంతో కళారంగంలో ఎదుగుతున్నా.’ అని పద్మాలయ ఆచార్య తెలిపారు.
నాగర్కర్నూల్, మార్చి 7 : ఆమె వృత్తి ఉద్యోగం.. ప్రవృత్తి హరికథలు చెప్పడం.. అంతేకాక రచనలు చేస్తూ గాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ హరికథలకు గుర్తింపు తెచ్చిన ఘనత పద్మాలయ ఆచార్యకే సొంతం. తాను చదువుకున్న పాఠశాలలోనే పాఠాలు బోధించి.. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు పొందారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన పద్మాలయ ఆచార్య ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. హరికథలు చెబుతూనే.. కవయిత్రిగా, గాయనిగానే కాకుండా నాట్య కళాకారిణిగా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.
హరికథ అంటేనే.. పద్మాలయ అనేలా ముద్రవేసుకున్నారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. 2015న ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. సీఎం కేసీఆర్, అప్పటి స్పీకర్ చక్రపాణితోపాటు పలువురు ప్రముఖులు ఆమెను సన్మానించారు. ఇప్పటివరకు 32 పురస్కారాలను అందుకున్నారు. నవ్వుల నావ, ఊరుకొండ వీరన్న చరిత్ర, పాలమూరు జిల్లా హరికథలు, ఉప్పరిపల్లి అమ్మవార్ల దివ్యచరిత్ర, సోమశిల కీర్తనలు, పసిడి మొగ్గలు, హరికథ-ఆవిర్భావం, వివేకానంద, అధికారధనం సమీక్ష, బాబోయ్ ఫోన్ హాస్యకథ వంటి నాటికలు, బాలగేయాలు, యానగుంది మాణికేశ్వరిమాత దివ్యచరిత్ర, పరమానందయ్య శిష్యుల కథలు రాయడంతోపాటు ప్రత్యేకంగా పుస్తకాలను ముద్రించారు.
మైసమ్మ లీలలు, బడి తని ఖీ, స్వచ్ఛభారత్, హెల్మెట్, ఇంటర్వ్యూ, డబ్బు వంటి టెలీఫిలిమ్స్ సీడీలు విడుదల చేశారు. అంతేకాకుండా రచనలు, గానం చేసిన సీడీలు, ప్రత్యేక కార్యక్రమాలను ఆయా ఛానళ్లలో ప్రదర్శించారు. 2019 తెలుగు మహిళా సదస్సులో మహిళా శిరోమణి పురస్కారం అందుకున్నారు. ఇప్పటివరకు దాదాపు ఆరువేలకుపైగా కళాప్రదర్శనలు చేసి హరికథకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది.
పద్మాలయ అందుకున్న పురస్కారాల్లో కొన్ని..