జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 26 : జడ్చర్ల డిగ్రీ కళాశాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావటం గొప్ప విషయమని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని డాక్టర్ బీ.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన భవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ తెలంగాణ బొటానికల్ గార్డెన్, హెర్బరియం ఏర్పాటుతో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఈ గుర్తింపు రావటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.
భావితరాలకు ఉన్నత ప్రమాణాలతో విద్యనందించేందుకు గానూ కళాశాలకు న్యాక్ ఏ ప్లస్ప్లస్ గ్రేడ్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రేడ్ సాధించేందుకు అందరం కలసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇందుకు తనవంతుగా అన్నివిధాలా పూర్తి సహకారాన్ని అందిస్తానని చెప్పారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన మొత్తాన్ని ఎమ్మెల్యే నిధుల నుంచి అందజేస్తానన్నారు. అలాగే కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ తమ వంతుగా సహకారాన్ని అందించాలని కోరారు.
అనంతరం కళాశాల ఆవరణలో మొక్క నాటి నీళ్లు పోశారు. పలువురు పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి విరాళాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పీయ చిన్న మ్మ, పూర్వ విద్యార్థుల సంఘం కన్వీనర్ రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి బాద్మి రవిశంకర్, న్యాక్ విభాగం కమిటీ కన్వీనర్ శ్రీనివాసులు, అధ్యాపకులు సదాశివ య్య, ఎన్. సుభాషిణి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని బాలికల ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో మానవత్వ సందేశ సమితి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్యతోపాటు పలువురికి ఎమ్మెల్యే వైద్య పరీక్షలు చేసి రోగులతో మాట్లాడారు. ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.